News September 12, 2025

విశాఖ: మహిళా డాక్టర్‌ను వేధించిన వార్డ్‌బాయ్ సస్పెండ్

image

కేజీహెచ్‌లో వార్డ్ బాయ్ శంకర్రావు తనను వేధిస్తున్నాడంటూ ఓ మహిళా డాక్టర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో 10 రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. ఈ విషయం ఆస్పత్రిలోని పైఅధికారుల దృష్టికి వెళ్లడంతో వారు వార్డ్ బాయ్‌ను సస్పెండ్ చేస్తూ శుక్రవారం ప్రకటన జారీ చేశారు. ఈరోజు ఉదయం కూడా ఓ రోగి పట్ల వార్డ్ బాయ్స్ దురుసుగా ప్రవర్తించినట్లు సమాచారం.

Similar News

News December 9, 2025

తిరుపతిలో విద్యార్థినిపై ర్యాపిడో డ్రైవర్ అత్యాచారం

image

తిరుపతిలో ఓ కళాశాల విద్యార్థిని(మైనర్ బాలిక)పై ర్యాపిడో ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడినట్లు అలిపిరి పోలీసులు తెలిపారు. హాస్టల్ మారే క్రమంలో పరిచయమైన డ్రైవర్ డబ్బు సాయం చేస్తానని నమ్మబలికి బాలికను గదికి తీసుకెళ్లి ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు పేర్కొన్నారు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించగా, బాధితురాలు తన ఫ్రెండ్‌తో పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై పోక్సో కేసు నమోదైంది.

News December 9, 2025

ఖమ్మం జిల్లాలో పడిపోయిన టెంపరేచర్

image

రెండు రోజులుగా వాతావరణం అనూహ్యంగా మారిపోయింది. ఖమ్మం జిల్లాలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా 15 డిగ్రీలకు పడిపోవడంతో చలి తీవ్రత పెరిగింది. ఉదయం 10 గంటల వరకు దట్టమైన పొగమంచు, చల్లని గాలుల ప్రభావం కనిపించింది. ఈ చలి కారణంగా ప్రజలు జలుబు, గొంతు నొప్పితో ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. వృద్ధులు, చిన్న పిల్లల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.

News December 9, 2025

బెస్ట్ రైస్ డిష్‌లో హైదరాబాద్ బిర్యానీ సత్తా

image

ప్రపంచ ప్రఖ్యాత ఆహార రేటింగ్ సంస్థ టేస్ట్ అట్లాస్ విడుదల చేసిన 2026 ‘బెస్ట్ ఫుడ్’ జాబితాలో హైదరాబాద్ బిర్యానీ మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. టాప్ 100 డిషెస్ జాబితాలో 72వ స్థానంలో నిలిచిన హైదరాబాదీ బిర్యానీ, ప్రపంచంలోని టాప్ 50 బెస్ట్ రైస్ డిషెస్‌లో 10వ స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. సువాసనభరితమైన బాస్మతి రైస్, మసాలాలు హైదరాబాదీ బిర్యానీకి అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టాయి.