News September 10, 2025
విశాఖ: ‘రాత్రి వేళల్లో అదనపు సర్వీసులు వేయాలి’

విశాఖలో రాత్రి సమయంలో ఆర్టీసీ బస్సులు అదనపు సర్వీసులు నిర్వహించాలని పలువురు ప్రయాణికులు కోరారు. బుధవారం జిల్లా ప్రజా రవాణా అధికారి బి.అప్పలనాయుడు డైల్ యువర్ ఆర్‌ఎం ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రయాణికులు ఆయనకు పలు సూచనలు చేశారు. కాకినాడ, రాజమండ్రి ప్రాంతాలకు ఎక్స్‌ప్రెస్ సర్వీసులు వేయాలని కోరారు. నిర్ణీత సమయానికి గమ్యస్థానాలకు చేరుకునే విధంగా బస్సులు నడపాలన్నారు.
Similar News
News December 14, 2025
విశాఖ ఉక్కు పరిశ్రమలో అక్రమాలపై విజిలెన్స్ విచారణ

విశాఖ స్టీల్ ప్లాంట్ CMD వల్లే నష్టాల బారిన పడుతోందని కార్మిక సంఘాలు ఆరోపించాయి. క్వాలిటీ లేని ఉక్కు తయారీ, అక్రమాలపై CBI విచారణ చేయాలని ఫిర్యాదు చేశాయి. దీనిపై విచారణకు ప్రభుత్వం విజిలెన్స్ అధికారులను ఆదేశించింది. పదవీకాలం ముగుస్తున్న CMDని కొనసాగించవద్దని MLAలు CMకి ఫిర్యాదు చేశారు. మరోవైపు ప్రైవేటీకరణ విషయం వెనక్కి తగ్గడం లేదు. ప్లాంట్ ఆపరేషన్ విభాగం ప్రైవేటికరణకు టెండర్లను ఆహ్వానించింది.
News December 14, 2025
విశాఖ సెంట్రల్ జైలు ఖైదీలకు భగవద్గీత బోధన

విశాఖ కేంద్ర కారాగారంలో ఖైదీలకు మానసిక రుగ్మతలను జయించేందుకు, ప్రశాంతమైన జీవితాన్ని జీవించేందుకు భగవద్గీతను బోధించారు. భగవద్గీత మానవాళి జీవితానికి దిశా నిర్దేశంగా ఉంటుందని ఇస్కాన్ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. భగవద్గీతను అనుసరిస్తూ ప్రశాంతమైన జీవితాన్ని జీవించాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో ఇస్కాన్ సంస్థ ప్రతినిధులు, జైలు సిబ్బంది పాల్గొన్నారు.
News December 14, 2025
ఏయూలో రేపటి నుంచి ‘సరస్’ డ్వాక్రా బజార్

విశాఖ ఏయూ ఇంజినీరింగ్ మైదానంలో రేపటి (డిసెంబర్ 15) నుంచి 26వ తేదీ వరకు ‘సరస్’ (SARAS) అఖిల భారత డ్వాక్రా బజార్ జరగనుంది. గ్రామీణ మహిళల ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించే ఈ ప్రదర్శనలో దేశవ్యాప్తంగా 600 మంది మహిళలు.. 250 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. చేనేత వస్త్రాలు, హస్తకళలు, ఆహార పదార్థాలు ఇక్కడ లభిస్తాయని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు.


