News August 15, 2025
విశాఖ: రెండు రోజుల పాటు మాంసం విక్రయాలు బంద్

విశాఖ నగర పాలక సంస్థ పరిధిలోని మాంసం, చేపలు, చికెన్ దుకాణాలకు సెలవు ప్రకటించినట్లు జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఇ.ఎన్.వి. నరేశ్ కుమార్ గురువారం తెలిపారు. జీవీఎంసీ కమిషనర్ కేతన్ గర్గ్ ఆదేశాల మేరకు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శుక్రవారం, కృష్ణాష్టమి సందర్భంగా శనివారం అన్ని మాంసం దుకాణాలను, జంతు వధశాలలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని వ్యాపారులు గమనించాలని ఆయన సూచించారు.
Similar News
News March 11, 2026
విశాఖ: ఎన్నికలపై సందిగ్ధత

విశాఖలో భీమిలి నియోజకవర్గ పరిధిలోని సుమారు 64 గ్రామ పంచాయతీలను జీవీఎంసీలో విలీనం చేసే ప్రతిపాదనపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఒకవేళ ఈ ప్రక్రియ ప్రారంభమైతే వార్డుల పునర్విభజన, ఓటర్ల జాబితాల సవరణ, పరిపాలనా పునర్వ్యవస్థీకరణ వంటి పనులు చేపట్టాల్సి ఉంటుంది. ఇవి పూర్తయ్యే వరకు ఎన్నికలు వాయిదా పడే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై అనిశ్చితి నెలకొంది.
News March 11, 2026
విశాఖలో బార్ లైసెన్సులకు ఆసక్తి చూపని వ్యాపారులు

విశాఖలో బార్ల ఏర్పాటుకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. GVMC పరిధిలో మిగిలిన 25 బార్ల కేటాయింపునకు ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసినా ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. ఏడాదికి రూ.95 లక్షల లైసెన్స్ ఫీజుతో పాటు దరఖాస్తుతో రూ.5 లక్షల నాన్‌రిఫండబుల్ డీడీ తప్పనిసరి కావడం ప్రధాన కారణంగా భావిస్తున్నారు. మద్యం దుకాణాల పోటీ, భవన అద్దెలు, నిర్వహణ ఖర్చులు అధికంగా ఉండటంతో వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం.
News March 11, 2026
విశాఖ స్టీల్ ప్లాంట్ ఆపరేషన్ డైరెక్టర్‌గా సుబాసిస్ సేన్ గుప్తా

విశాఖ స్టీల్ ప్లాంట్ ఆపరేషన్స్ డైరెక్టర్‌గా సుభాసిస్ సేన్ గుప్తా ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆయన దుర్గాపూర్‌లోని సెయిల్‌లో చీఫ్ జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుత డైరెక్టర్ పురుషోత్తం పదవీ విరమణ నేపథ్యంలో నిర్వహించిన ఇంటర్వ్యూలో 12 మందిలో ఆయనను ఎంపిక చేశారు. వచ్చే నెలలో సుభాసిన్ సేన్ గుప్తా బాధ్యతలు స్వీకరించనున్నారు.


