News April 11, 2025
విశాఖ: రేపే ఇంటర్ ఫలితాలు

ఇంటర్ ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి. విశాఖ జిల్లాలో ఫస్టియర్ 42,257 మంది, సెకండియర్ 40,744 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. మొత్తం 83,001 మంది ఇంటర్ విద్యార్థులు పరీక్షలు రాశారు. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ☞ వే2న్యూస్ యాప్‌లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
Similar News
News January 16, 2026
విశాఖ: 26 ట్రావెల్ బస్సులపై కేసులు నమోదు

సంక్రాంతి పండుగల నేపథ్యంలో ఉప రవాణా కమిషనర్ ఆర్సీహెచ్ శ్రీనివాస్ ఆదేశాల మేరకు 2 రోజులుగా విశాఖలో మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్‌లు,ర వాణా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నిబంధనలు పాటించని 26 ట్రావెల్ బస్సులపై కేసులు నమోదు చేసి రూ.52,000 జరిమానాలు విధించారు. నిబంధనల ప్రకారం నడుచుకోవాలని, అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీలు కొనసాగుతాయన్నారు.
News January 16, 2026
ఎల్ఐసీ బిల్డింగ్ సమీపంలో వాహనం ఢీకొని వ్యక్తి మృతి

ఆర్టీసీ కాంప్లెక్స్, ఎల్ఐసీ బిల్డింగ్ మధ్యలో ఉన్న బస్టాప్ వద్ద శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి వయసు 75 సంవత్సరాలు దాటి ఉంటుందని ట్రాఫిక్ ఎస్ఐ సింహాచలం తెలిపారు. వైట్ షర్ట్ ధరించి ఉన్నాడన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని.. సీసీ ఫుటేజ్‌లు పరిశీలించి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
News January 16, 2026
విశాఖ: చీర విషయంలో గొడవ.. బాలిక ఆత్మహత్య

విశాఖలో పండగ పూట విషాదం నెలకొంది. MVP పోలీసుల వివరాల ప్రకారం.. పాత వెంకోజీ పాలెంలో ఉంటున్న బాలిక పల్లవి పండగ సందర్భంగా చీర కట్టుకుంటానని తల్లి లక్ష్మిని కోరింది. చీర వద్దు హాఫ్‌శారీ కట్టుకోమని తల్లి చెప్పడంతో గురువారం సాయంత్రం ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మనస్తాపానికి గురైన పల్లవి MVP కాలనీలో తన తాతయ్య వాచ్మెన్‌గా ఉంటున్న రెసిడెన్సి వద్ద ఆత్మహత్య చేసుకుంది. లక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.


