News September 11, 2025
విశాఖ: లొట్టలేసుకుని తింటున్నారా.. జర జాగ్రత్త..!

విశాఖలో 500 హోటళ్లు, 1200 వరకు ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. అయితే వీటిలో ఆహార నాణ్యతపై దృష్టి సారించిన జీవీఎంసీ.. జోన్‌కు రెండు చొప్పున శానిటేషన్ అండ్ హెల్త్ ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్‌లు ఏర్పాటు చేసింది. మొత్తం 16 టీంలు నెల రోజులుగా సోదాలు చేస్తున్నాయి. ఇప్పటివరకు 302 హోటళ్లలో తనిఖీలు చేసి 173 హోటళ్లలో నిల్వచేసిన ఆహారాన్ని విక్రయిస్తున్నట్లు గుర్తించి జరిమానాలు విధించింది.
Similar News
News December 12, 2025
TG న్యూస్ అప్డేట్స్

* HYD వేదికగా ఈ నెల 19 నుంచి 21 వరకు ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ జరగనుంది. ప్రదర్శనకు 700+ షార్ట్ ఫిల్మ్స్ రాగా 60 ఎంపికయ్యాయి.
* పలువురు కాంగ్రెస్ MLAలు, నాయకులకు క్యాబినెట్ హోదా కల్పించడాన్ని సవాల్ చేస్తూ ఎర్రోళ్ల శ్రీనివాస్(BRS) హైకోర్టులో పిల్ వేశారు.
* వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్ల గడువును పొడిగించాలని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుకు MP అసదుద్దీన్ విజ్ఞప్తి చేశారు.
News December 12, 2025
‘అదునెరిగి సేద్యం, పదునెరిగి పైరు’

సమయం చూసి వ్యవసాయం చేయాలంటారు పెద్దలు. అంటే, వాతావరణ పరిస్థితులు, భూమి స్వభావం, నీటి లభ్యత వంటి అంశాలను పరిశీలించి సాగును ప్రారంభించాలి. భూమికి, వాతావరణానికి అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే పంటను వెయ్యాలి. సమయం దాటితే పంట చేతికి రాదు, శ్రమ కూడా వృథా అవుతుంది. అలాగే ఏ పనిలోనైనా విజయం సాధించాలంటే సమయాన్ని సరిగ్గా అంచనా వేసి, సరైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని చెప్పడం ఈ సామెత ఉద్దేశం.
News December 12, 2025
ఇంట్లో ఏ రంగు శివలింగం ఉండాలి?

వేర్వేరు రంగుల శివలింగాలకు వేర్వేరు ప్రత్యేక శక్తులుంటాయని పండితులు చెబుతున్నారు. ‘నలుపు: రక్షణ, స్థిరత్వం, ధైర్యాన్ని, తెలుపు: శాంతి, ధ్యానానికి మద్దతు ఇస్తుంది. బంగారు/పసుపు: సంపద, వృత్తిలో పురోగతి, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆకుపచ్చ: కొత్త ప్రారంభాలకు సాయపడుతుంది. స్ఫటిక లింగం అతి శుభప్రదం. ఇది సామరస్యం, దైవిక రక్షణను ఆకర్షిస్తుంది. కోరికలకు తగిన లింగాన్ని ప్రతిష్ఠించాలి’ అని సూచిస్తున్నారు.


