News March 28, 2024

విశాఖ: సముద్రంలో డీజిల్ కొట్టేసే ముఠా అరెస్ట్ 

image

సముద్రంలోని నౌకల నుంచి డీజిల్ స్మగ్లింగ్ చేసే ముఠా సభ్యులు వీర్రాజు, బడే రాజు, సూరాడ రాములును అరెస్టు చేసినట్లు డీసీపీ-2 ఎం.సత్తిబాబు తెలిపారు. సముద్రంలో ఉన్న నౌకల నుంచి డీజిల్ దొంగలించి బోట్లు ద్వారా తీరానికి తీసుకువచ్చి వారు విక్రయిస్తున్నట్లు తెలిపారు. సుమారు 13 మంది నౌకల నుంచి డీజిల్ స్మగ్లింగ్ చేస్తున్నట్టు గుర్తించామన్నారు. వీరిలో ముగ్గురు పట్టుబడుగా మిగిలిన వారి కోసం గాలిస్తున్నామన్నారు.

Similar News

News February 14, 2026

16 నుంచి విశాఖలో గవర్నర్ అబ్దుల్ నజీర్ పర్యటన

image

రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈనెల 16 నుంచి 20వ తేదీ వరకు విశాఖలో జరిగే పలు కార్యక్రమాలలో పాల్గొననున్నారు. ఈ నెల 16న రాత్రి 9 గంటలకు విశాఖ చేరుకొని బస చేస్తారు. 17న సాయంత్రం విశాఖ వస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలుకుతారు. అనంతరం రాష్ట్రపతి విందులో పాల్గొంటారు. 18న ఐఎఫ్ఆర్‌లో పాల్గొంటారు. ఆ రోజు సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వీడ్కోలు పలుకి 20న విజయవాడ బయలుదేరుతారు.

News February 14, 2026

విశాఖ: బిల్డింగ్ పైనుంచి పడి యువకుడి మృతి

image

విశాఖలోని సాగర్ నగర్‌లో బిల్డింగ్ పరంజి విరిగి యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. వాంబేకాలనీకి చెందిన కోలా రాజు(30) డ్రైవింగ్, విద్యుత్ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలోనే శుక్రవారం ఓ బిల్డింగ్‌లో విద్యుత్ పని చేస్తుండగా పరంజి విరిగిపోవటంతో 4 అంతస్థుల పైనుంచి పడి మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్‌కి తరలించారు.

News February 14, 2026

విశాఖ: కోస్టల్ కారిడార్‌లో మార్పులు

image

సవరించిన VMRDA మాస్టర్ ప్లాన్‌లో భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ అనుసంధాన బీచ్ కారిడార్‌కు స్వల్ప మార్పులు ప్రతిపాదించారు. కోస్టల్ బ్యాటరీ-కైలాసగిరి వరకు 40M, అక్కడి నుంచి భోగాపురం వరకు 60M వెడల్పుతో రహదారి ప్రతిపాదన, రాడిసన్ బ్లూ వద్ద ఎలివేటెడ్ మార్గం, మూలకుద్దు సమీపంలో ఐకానిక్ బ్రిడ్జి ప్రణాళికలో ఉన్నాయి. ఈ మార్పులు ట్రాఫిక్ సౌలభ్యం, పర్యాటక అభివృద్ధి దృష్టిలో ఉంచుకుని రూపొందించినట్లు అధికారులు తెలిపారు.