News May 21, 2024

విశాఖ: సామాన్యులకు అందని మామిడి పండ్లు

image

మామిడి పండ్ల ధరలు సామాన్యులకు అందుబాటులో లేవు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది మామిడి దిగుబడి గణనీయంగా తగ్గింది. దీంతో మామిడి పండ్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. విశాఖ నగరంలో కిలో మామిడి పండ్లను రూ.150- రూ.200కు విక్రయిస్తున్నారు. దీంతో సామాన్యులు వాటి దగ్గరికి వెళ్లడానికి భయపడుతున్నారు.

Similar News

News March 14, 2026

విశాఖలో నియోజకవర్గ వైసీపీ పరిశీలకుల నియామకం

image

విశాఖలోని అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ పరిశీలకులుగా పలువురుని వైసీపీ కేంద్రపార్టీ కార్యాలయం నియమించింది.
➤ విశాఖ నార్త్: చింతకాయల సన్యాసి పాత్రుడు
➤ విశాఖ సౌత్: వీసం రామకృష్ణ
➤ విశాఖ వెస్ట్: జాహీర్ అహ్మద్
➤ విశాఖ ఈస్ట్: పేడాడ రమణి కుమారి
➤ గాజువాక: పసుపులేటి బాలరాజు
➤ భీమిలి: తైనాలా విజయ్ కుమార్‌ను నియమిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది.

News March 14, 2026

భీమిలి: ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య

image

భీమిలి పరిధి కాపుల ఉప్పాడలో ఉంటున్న అప్పలరాజు కుటుంబ తగాదాల నేపథ్యంలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో అప్పలరాజు తీవ్రంగా గాయపడడంతో గీతం ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఇక్కడి నుంచి కేజీహెచ్‌కి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందినట్లు భీమిలి పోలీసులు తెలిపారు.

News March 14, 2026

విశాఖ: దూసుకెళ్లిన స్కూలు బస్సు.. ఒకరి మృతి

image

శుభకార్యానికి వెళ్తున్న వ్యక్తిని స్కూలు బస్సు రూపంలో మృత్యువు వెంటాడింది. భీమిలి మండలం నారాయణరాజుపేట జంక్షన్లో శుక్రవారం ఉదయం ప్రమాదం జరిగింది. విజయనగరం (D) డెంకాడ (M) జొన్నాడకి చెందిన జీ.సూర్యనారాయణ మరొకరి బైక్‌పై వెళ్తుండగా స్కూలు బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో సూర్యనారాయణ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. బస్సును క్లీనర్ డ్రైవ్ చేసినట్లు భీమిలి ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.