News August 23, 2025

విశాఖ సెంట్రల్ జైలుకు శ్రీకాంత్ తరలింపు

image

నెల్లూరు జిల్లా సెంట్రల్ జైల్లో ఉన్న రౌడీ షీటర్ శ్రీకాంత్‌ను అధికారులు విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు. భద్రతా కారణాలు దృష్ట్యా ఈ విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచారు. ఉదయం 6:30 సమయంలో విశాఖ జైలుకు అతను చేరుకున్నాడు. పెరోల్ రద్దు వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి అతన్ని వేరే జైలుకు తరలిస్తారన్న ప్రచారం జరిగింది. ఈ క్రమంలో అతన్ని విశాఖ తరలించారు.

Similar News

News January 22, 2026

నెల్లూరు మీదుగా మరో ప్రతిష్ఠాత్మక రైలు.!

image

దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) తాజాగా హైదరాబాద్ (చర్లపల్లి)-తిరువనంతపురం నార్త్ మధ్య కొత్త అమృత్ భారత్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ ప్రవేశపెట్టబోతోంది. ఈ రైలు నెల్లూరు మీదుగా వెళ్లనుంది. నెల్లూరుకు ఉదయం 5:43కు రానున్న ఈ రైలు 5.45AMకు బయలుదేరి 4:30 PMకు చర్లపల్లి చేరుకోనుంది. ఉదయాన్నే నెల్లూరు నుంచి HYD వెళ్లాలనుకునే వారికి ఈ రైలు ఉపయోగపడనుంది.

News January 22, 2026

ఉదయగిరి: కెమెరాకు చిక్కిన పెద్దపులి.?

image

ఉదయగిరి-బండగానిపల్లి ఘాట్ రోడ్డులో సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న పెద్దపులి అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలోని ఓ కెమెరాకు చిక్కినట్లు సమాచారం. అయితే అటవీ శాఖ అధికారులు మాత్రం దీనిని అధికారికంగా నిర్ధారించలేదు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు చేరవేసినట్లు సమాచారం. కొండ కింద గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయడంతోపాటు ఘాట్ రోడ్డులో రాకపోకలు సాగించే వాహనదారులను అప్రమత్తం చేస్తున్నారు.

News January 22, 2026

నెల్లూరు: ఆగని తల్లుల కడుపు‘కోత’.!

image

జిల్లాలో సిజేరియన్ ప్రసవాలు దారుణంగా పెరిగిపోతున్నాయి. సాధారణ ప్రసవం అయ్యే అవకాశం ఉన్నా డబ్బుల కక్కుర్తితో డాక్టర్లు కత్తికి పనిచెబుతున్నారు. జిల్లాలో ఏటా 10 వేల వరకు ప్రసవాలు జరుగుతుండగా, ప్రైవేట్ ఆసుపత్రుల్లో 30 వేల వరకు ఉంది. 2024-25 మధ్య దాదాపు 11 వేల వరకు సిజేరియన్‌లు జరిగాయట. ప్రైవేట్ ఆసుపత్రుల్లో సరైన నిఘా లేకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొందట. దీనిపై DMHO సుజాత సైతం ఆందోళన వ్యక్తం చేశారు.