News August 13, 2025
విశాఖ: 12 ఏళ్లుగా తప్పించుకుని తిరుగుతున్న నిందితుడు అరెస్ట్

న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2013లో ఇంట్లోకి చొరబడి నవ వధువు త్రివేణిపై లోకేశ్ లైంగిక దాడి చేశాడు. ఆమె ప్రతిఘటించడంతో హత్య చేశాడు. దీంతో అప్పుడు పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. జైలు నుంచి బెయిల్‌పై విడుదలై గత 12 ఏళ్లుగా కోర్టుకు హాజరు కాకపోవడంతో లోకేశ్‌ను పట్టుకోవాలని కోర్టు ఆదేశించింది. విజయవాడలో లోకేశ్ ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అతడ్ని అరెస్ట్ చేసి మంగళవారం రిమాండ్‌కు పంపారు.
Similar News
News March 13, 2026
విజయనగరంలో జోయాలుక్కాస్ గ్రాండ్ ఓపెనింగ్

విజయనగరంలో జోయాలుక్కాస్ జువెలరీ షోరూమ్‌ను స్థానిక ఎమ్మెల్యే అదితి గజపతిరాజు శుక్రవారం ఉదయం ప్రారంభించారు. వినియోగదారులు ఈ షోరూమ్‌లో ఒకే చోట బంగారం, వజ్రాలు, విలువైన రాళ్లు, ప్లాటినం, వివాహ ఆభరణాలు పొందవచ్చని ఆమె పేర్కొన్నారు. మార్చి 29 వరకు తయారీ ఛార్జీలపై ఫ్లాట్ 40% ప్రారంభ ఆఫర్‌ను అందిస్తున్నట్లు గ్రూప్ ఛైర్మన్&మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జోయ్ అలుక్కాస్ తెలిపారు.
News March 13, 2026
జిల్లాలో బాపట్ల మండలం అత్యధికం

బాపట్ల జిల్లా వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కింద అత్యధికంగా బాపట్ల మండలంలో రైతులకు లబ్ధి చేకూరనున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి విజయనిర్మల తెలిపారు. బాపట్ల మండలంలో అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 11,275 మందికి రూ.4.51 కోట్లు, పీఎం కిసాన్ పథకం ద్వారా 8,811 మందికి 1.76 కోట్లు నిధులు విడుదల కానున్నట్లు తెలిపారు. మొత్తంగా 6.27 కోట్ల రూపాయలు నిధులు శుక్రవారం నేరుగా రైతుల ఖాతాల్లో జమవుతాయన్నారు.
News March 13, 2026
ఆర్మూర్: 68 గ్యాస్ సిలిండర్లు సీజ్

ఆర్మూర్ పట్టణంలోని హోటళ్లు, టిఫిన్ సెంటర్లపై విజిలెన్స్, సివిల్ సప్లై అధికారులు శుక్రవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా గృహ వినియోగ (డొమెస్టిక్) గ్యాస్ సిలిండర్లను వాడుతున్న 31 సెంటర్లను గుర్తించి, మొత్తం 68 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. వాణిజ్య అవసరాలకు డొమెస్టిక్ సిలిండర్లు వాడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు.


