News December 1, 2025

విశాఖ: 20 వసంతాలు సరే.. పల్లెల్లో అభివృద్ధి జాడ ఏది!

image

గ్రేటర్ విశాఖగా మహానగరం అభివృద్ధి ప్రయాణం 2 దశాబ్ధాలు పూర్తి చేసుకుంది. 98వార్డుల్లో సుమారు 22లక్షల జనాభా, రూ.5 కోట్ల వార్షిక బడ్జెట్‌తో రాష్ట్రంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పోరేషన్‌గా ఆవిర్భవించింది జీవీఎంసీ. అయితే నగరంలో విలీనమైన శివారు గ్రామాలకు మాత్రం టాక్సుల మోత మోగుతుందే తప్ప పట్టణ ప్రజలకు అందుతున్న సౌకర్యాల్లో వాళ్ళ వాటా ఎంత అంటే ఆవగింజలో అరవయ్యో వంతే అన్నది విస్పష్టం. దీనిపై మీ కామెంట్.

Similar News

News February 16, 2026

మెదక్: 4 ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలు ప్రశాంతం: ఎస్పీ

image

మెదక్ జిల్లా పరిధిలోని నాలుగు మున్సిపాలిటీలలో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినట్లు ఎస్పీ డీవీ. శ్రీనివాస రావు తెలిపారు. తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఎస్పీ స్వయంగా పరిస్థితిని సమీక్షించారు. అదనపు పోలీస్ బలగాలను మొహరించి, పోలీస్ అధికారులతో సమన్వయం చేస్తూ తక్షణ చర్యలు చేపట్టారు.

News February 16, 2026

ADB: 25ఏళ్ల తర్వాత రెండో సారి

image

ఆదిలాబాద్ మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా స్వతంత్ర అభ్యర్థి అనూష బండారి ప్రమాణ స్వీకారం చేశారు. 2001లో స్వతంత్ర అభ్యర్థిగా గొడుగు గుర్తుపై లాలా రాధేశ్యాం పోటీ చేసి గెలుపొంది మున్సిపల్ ఛైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. సుమారు 25 ఏళ్ల తర్వాత మళ్లీ కుక్కర్ గుర్తుపై గెలుపొందిన స్వతంత్ర అభ్యర్థి అనూష ఛైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు.

News February 16, 2026

బిల్ గేట్స్‌కు కలంకారీ వస్త్రాలను బహుకరించిన కలెక్టర్

image

రాష్ట్ర పర్యటనకు వచ్చిన బిల్ గేట్స్‌కు గన్నవరం విమానాశ్రయం వద్ద ఘన స్వాగతం లభించింది. కలెక్టర్ డీకే బాలాజీ బిల్ గేట్స్‌కు పెడన కలంకారీ వస్త్రాలను బహుకరించి స్వాగతం పలికారు. సహజమైన రంగులతో ముద్రించిన కలంకారీ వస్త్రాల విశిష్టత, దాని వెనుక దాగి ఉన్న కళా నైపుణ్యాన్ని కలెక్టర్ ఆయనకు వివరించారు.