News June 13, 2024

విశాఖ: 26 కేంద్రాల్లో పరీక్ష

image

జిల్లాలో ఈనెల 16వ తేదీన రెండో సెష‌న్ల‌లో జ‌రిగే యూపీఎస్సీ ప్రిలిమిన‌రీ ప‌రీక్ష నిర్వ‌హ‌ణ‌కు జిల్లాలో ప‌టిష్ట ఏర్పాట్లు చేయాల‌ని జిల్లా రెవెన్యూ అధికారి కె.మోహ‌న్ కుమార్ అధికారుల‌ను ఆదేశించారు. ఎలాంటి లోపాలు త‌లెత్త‌కుండా స‌మ‌న్వ‌యం పరీక్ష విజయవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. పరీక్షల నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. జిల్లాలోని 26 కేంద్రాలలో ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

Similar News

News March 19, 2025

ట్రాన్స్‌జెండర్ హత్య ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా

image

అనకాపల్లి జిల్లాలో ట్రాన్స్‌జెండర్ దారుణ హత్య ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న సీఎం.. అక్కడి నుంచి అనకాపల్లి ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడారు. త్వరగా దర్యాప్తు పూర్తి చేసి నిందితులకు శిక్ష పడేలా చూడాలన్నారు. ఇప్పటికే నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ సీఎంకు తెలిపారు. కాగా ట్రాన్స్‌జెండర్‌ను చంపి ముక్కలుగా నరికి మూట కట్టి కశింకోట(M) బయ్యవరం వద్ద పడేసిన సంగతి తెలిసిందే.

News March 19, 2025

గాజువాక ఐటీఐలో నేడు జాబ్ మేళా 

image

గాజువాక ఐ.టి.ఐలో నేడు జాబ్ మేళా జరగనుంది. అప్రెంటీస్‌తో పాటు నిరుద్యోగులు ఉదయం 9 గంటలకు ఆధార్ కార్డు, ఒరిజినల్ సర్టిఫికెట్లుతో రావాలని ఐటీఐ ప్రిన్సిపల్ కె.ఎస్. శ్రీనివాసరావు తెలిపారు. పదవతరగతి, ఐటీఐ, డిగ్రీ విద్యార్హతతో పాటు 18నుంచి 35ఏళ్లలోపు అభ్యర్థులు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చని అన్నారు. జిల్లా నైపుణ్యభివృద్ధిసంస్థ, ఉపాధిశాఖ ఆధ్వర్యంలో ఈ ఇంటర్వ్యూలు జరుగుతాయని అయన తెలిపారు.

News March 19, 2025

విశాఖ రైల్వే స్టేషన్‌లో గంజాయితో ఐదుగురు అరెస్ట్

image

విశాఖ రైల్వే స్టేషన్‌లో జీఆర్పీ ఇన్స్పెక్టర్ ధనంజయనాయుడు ఆధ్వర్యంలో మంగళవారం తనిఖీలు చేపట్టారు. తనిఖీలలో ఐదుగురు నుంచి రూ.1,17,000 విలువ గల 23.4 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని సీజ్ చేసి ముద్దాయిలను కోర్టులో హాజరు పరిచారు. నిందితులను పట్టుకున్న సబ్-ఇన్స్పెక్టర్లు రామారావు,కీర్తి రెడ్డి,అబ్దుల్ మారూఫ్,శాంతరాం, సిబ్బందిని రైల్వే పోలీస్ డీసీపీ రామచంద్ర రావు అభినందించారు.

error: Content is protected !!