News June 4, 2024

విశాఖ: 6,7 తేదీల్లో బస్ పాస్ కౌంటర్లకు సెలవు

image

బస్ పాస్ దరఖాస్తు మార్పుల కారణంగా ఈ నెల 6, 7 తేదీల్లో బస్ పాస్ కౌంటర్లకు సెలవు ప్రకటిస్తున్నట్లు ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణా అధికారి ఎ.అప్పలరాజు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. మరల తిరిగి ఈ నెల 8వ తేదీ నుంచి యధావిధిగా బస్ పాసు కౌంటర్లు పని చేస్తాయని పేర్కొన్నారు. ఈనెల 8వ తేదీ నుంచి బస్ పాసు చేయించుకునే వారు కొత్తగా గుర్తింపు కార్డులు పొందాలని సూచించారు. పాత కార్డులు చెల్లవని ఆయన స్పష్టం చేశారు.

Similar News

News September 10, 2024

ఈనెల 17 వరకు సింహాచలంలో వార్షిక పవిత్రోత్సవాలు

image

సింహాచలం ఆలయంలో ఈనెల 13 నుంచి 17 వరకు వార్షిక పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాస మూర్తి తెలిపారు. ఈ ఉత్సవాల్లో భాగంగా విశేష హోమాలు, వేద పారాయణం, తిరువీధి ఉత్సవాలు జరుగుతాయన్నారు. పవిత్ర ఉత్సవాల సందర్భంగా దేవాలయంలో ఈనెల 13 నుంచి ఆర్జిత సేవలతో పాటు నిత్య కళ్యాణ ఉత్సవాలు కూడా రద్దు చేసినట్లు పేర్కొన్నారు. రాత్రి 7 గంటల తర్వాత స్వామి దర్శనాలు లభించవన్నారు.

News September 10, 2024

స్టీల్ ప్లాంట్ కార్మికులు రాస్తారోకో.. పరిస్థితి ఉధృతం

image

విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు కూర్మన్నపాలెం జంక్షన్ వద్ద రిలే నిరాహార దీక్ష చేపట్టారు. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అడ్డుకుంటున్న పోలీసులతో కార్మికులు తీవ్ర వాగ్వివాదానికి దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పలువురు కార్మికులను పోలీసులు అరెస్టు చేసి వాహనంలో పోలీస్ స్టేషన్కు తరలించారు.

News September 10, 2024

విశాఖ: సహాయక చర్యల పై హోంమంత్రి సమీక్ష

image

వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టిన సహాయక చర్యలపై హోంమంత్రి వంగలపూడి అనిత విశాఖ కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పంట నష్టాన్ని అంచనా వేసి నివేదికను అందజేయాలన్నారు. పునరావాస కేంద్రాల్లో బాధితులకు అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, సీపీ శంఖబ్రత భాగ్చీ, జేసీ మయూర్ అశోక్ పాల్గొన్నారు.