News August 21, 2025

విషాదం.. వేడి పాలు నోటిలో పడి చిన్నారి మృతి

image

వేడి పాలు చిన్నారి ప్రాణం తీశాయి. ఈ విషాద ఘటన గుత్తి కోటలో జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. ప్రతాప్ రెడ్డి, మేనక దంపతుల కుమారుడు షర్మిల్ రెడ్డి (15 నెలల బాలుడు) వేడి చేసిన పాలను తాగడానికి ప్రయత్నించాడు. ప్రమాదవశాత్తు అవి నోరు, ముక్కులో పడ్డాయి. ఊపిరాడకపోవడంతో మరణించాడు. ఈ ఘటనతో కోటవీధిలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Similar News

News January 14, 2026

రిజిస్ట్రేషన్లు వేగవంతం చేయాలి: కలెక్టర్

image

జిల్లాలో సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు సక్రమంగా పనిచేయాలని కలెక్టర్ కృత్తికా శుక్లా ఆదేశించారు. 22/ఏ సకాలంలో రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాలని, డిజిటల్ సేవలను పూర్తిగా వినియోగించి అమరావతి మండలం, 4 గ్రామాల్లో రిజిస్ట్రేషన్లు వేగవంతం చేయాలని సూచించారు. ప్రజలతో సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని తెలిపారు. డీఆర్ఓ మురళి, డీఐజీ జి.శ్రీనివాసరావు, జిల్లా రిజిస్టర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

News January 14, 2026

ప.గో జిల్లా ఎస్పీ హెచ్చరిక

image

సంక్రాంతి పండుగ ముసుగులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ నయీమ్ అస్మి హెచ్చరించారు. హైకోర్టు ఆదేశాలతో కోడిపందేలు, పేకాట, గుండాట వంటి జూద క్రీడలను నిషేధించినట్లు స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పారు. ప్రజలు చట్టవ్యతిరేక పనులకు దూరంగా ఉండి, కుటుంబాలతో ఆనందంగా పండుగ జరుపుకోవాలని సూచించారు.

News January 14, 2026

నేటి ముఖ్యాంశాలు

image

❃ తెలుగు ప్రజలకు ఇరు రాష్ట్రాల సీఎంల పండగ విషెస్
❃ AP:అదనపు ఛార్జీలు వసూలు చేస్తే బస్సులు సీజ్: మండిపల్లి
❃ వైద్య శాఖకు ₹567 కోట్ల కేంద్ర నిధులు: సత్యకుమార్
❃ TG: గ్రామపంచాయతీలకు రూ.277 కోట్లు విడుదల
❃ అటెన్షన్ డైవర్షన్ కోసమే కమిషన్‌లు, సిట్‌ల ఏర్పాటు: KTR
❃ ఓల్డ్ సిటీలో కరెంట్ బిల్లులు చెల్లించట్లేదు: ఎంపీ కొండా
❃ కవిత కాంగ్రెస్‌లో చేరడం లేదు: పీసీసీ చీఫ్
❃ కుక్క కాటు మరణాలకు భారీ పరిహారం: SC