News November 19, 2025
విష్ణు సహస్ర నామాలు ఎలా ఏర్పడ్డాయి?

భీష్ముడు అంపశయ్యపై తొలిసారిగా విష్ణు సహస్ర నామాలను స్తుతించాడు. ఇవి విష్ణుమూర్తి గొప్పతనాన్ని, ఆయన 1000 పేర్లను సూచిస్తాయి. అయితే కృష్ణుడి సలహాతో సహదేవుడు ఆ నామాలను మళ్లీమళ్లీ వినిపించేలా చేశాడు. అదే సమయంలో వ్యాసుడు వాటిని రాశాడు. ఈ నామాలను పఠించినవారికి ఆధ్యాత్మికతపై ఏకాగ్రత పెరుగుతుందని, వారిని భక్తి మార్గాన పయణించేలా చేస్తుందని నమ్మకం. ఆ నామాలు, వాటి భావాలను Way2News రోజూ మీకు అందిస్తుంది.
Similar News
News January 19, 2026
సంగారెడ్డి: ఆరు కొత్త బల్దియాలో తొలిసారి ఎన్నికలు

జిల్లాలో కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీల్లో తొలిసారిగా ఎన్నికలు జరగనున్నాయి. గుమ్మడిదల, ఇంద్రేశం, జిన్నారం, ఇస్నాపూర్, గడ్డపోతారం, కోహీర్ కొత్త బల్దియాలో ఛైర్మన్, కౌన్సిలర్ల రిజర్వేషన్లు వెళ్లడయ్యాయి. కౌన్సిలర్ రిజర్వేషన్లపై ప్రజలు, నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇస్నాపూర్, గడ్డపోతారం మున్సిపాలిటీలో ఎస్సీలకు వార్డులు రిజర్వ్ చేయకపోవడంపై ఎన్నికల అధికారికి దళితులు ఫిర్యాదు చేశారు.
News January 19, 2026
సిరిసిల్ల: రైతులకు ఆయిల్ పామ్ సాగుపై క్షేత్ర సందర్శన

వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించేందుకు రాజన్న సిరిసిల్ల జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. సాగుపై అపోహలు తొలగించేందుకు కలెక్టర్ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా అశ్వరావుపేటకు క్షేత్ర సందర్శన ఏర్పాటు చేసినట్లు ఏఈఓ గౌతమి తెలిపారు. ఆసక్తిగల రైతులు సోమవారం సాయంత్రం 6 గంటలకు కలెక్టరేట్ వద్దకు చేరుకోవాలని, అక్కడి నుంచి బస్సు సౌకర్యం ఉంటుందని పేర్కొన్నారు. వివరాలకు 9281096889 సంప్రదించండి.
News January 19, 2026
SKLM: నేడు ప్రజా ఫిర్యాదుల నమోదు

నేడు ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక జిల్లా పరిషత్‌లో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఓ ప్రకటనలో ఆదివారం వెల్లడించారు. అర్జీదారులు వారి సమస్యలను నేరుగా, ఆన్‌లైన్‌లోని Meekosam.ap.gov.inలో సమర్పించుకోవాలన్నారు. అర్జీలు సమర్పించిన వారు వాటి స్థితిని తెలుసుకునేందుకు 1100 నంబర్‌కు నేరుగా ఫోన్ చేసి తెలుసుకోవాలన్నారు.


