News August 14, 2025
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్

భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, యూరియా నిల్వలపై సీఎస్ రామకృష్ణారావుతో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ పాల్గొన్నారు. వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై మంత్రి సూచనలు చేశారు.
Similar News
News March 16, 2026
భగ్గుమంటున్న నల్లమల.. ముప్పులో వన్యప్రాణులు

ఎండలు పెరగడంతో 2,611 చ.కి.మీ. విస్తీర్ణంలోని నల్లమల అడవుల్లో కార్చిచ్చు రేగుతోంది. ఈ ఏడాది ఇప్పటికే 50చోట్ల మంటలు చెలరేగగా, గతేడాది 1,026హెక్టార్ల అడవి బుగ్గిపాలైంది. 70-80% ప్రమాదాలు మానవ తప్పిదాల వల్లే జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. మంటల నివారణకు 29బేస్ క్యాంపులు, 94ఎయిర్ బ్లోయర్లతో సిబ్బంది నిరంతరం నిఘా ఉంచారు. శాటిలైట్ సాయంతో మంటలను గుర్తించి అదుపుచేసే ప్రయత్నం చేస్తున్నారు.
News March 16, 2026
శ్రీకాకుళం: రెండు నెలల్లో.. ఐదు బ్యాంకు ఉద్యోగాలు..!

శ్రీకాకుళం జిల్లా గార మండలం జొన్నలపాడుకు చెందిన ఎం. స్వప్న అసాధారణ ప్రతిభతో ఆదర్శంగా నిలిచారు. వివాహం తర్వాత అత్తవారి ఇంట్లో ఉంటూనే పట్టుదలతో చదివి, కేవలం రెండు నెలల వ్యవధిలోనే ఐదు బ్యాంకు ఉద్యోగాలను సొంతం చేసుకున్నారు. ఇందులో రెండు PO పోస్టులు, రెండు క్లర్క్ పోస్టులు, ఒక జూనియర్ అసోసియేట్ ఉద్యోగం ఉన్నాయి. విశాఖపట్నంకు చెందిన స్వప్న, తన విజయంతో మహిళల ఆత్మవిశ్వాసాన్ని చాటిచెప్పారు.
News March 16, 2026
అవతార్‌కు ఆస్కార్.. విమర్శలు!

అవతార్ ఫైర్ అండ్ యాష్‌కు విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరీలో ఆస్కార్ దక్కింది. గతేడాది రిలీజైన ఈ చిత్రం ఆకట్టుకోలేదు. అయినా ఆస్కార్ రావడంపై కొందరు IND సినీ ఫ్యాన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. హాలీవుడ్‌లో సినిమాలు ఎలా ఉన్నా ఆస్కార్ ఈజీగా వస్తుందని, భారతీయ చిత్రాలు ఎంత బాగా తీసినా ఇవ్వరని కామెంట్స్ చేస్తున్నారు. అయితే విజువల్ వండర్ కావడంతోనే అవతార్‌కు అవార్డు వచ్చిందని మరికొందరు అంటున్నారు. మీ కామెంట్?


