News March 8, 2025

వీణవంక: బస్సులోనే గుండెపోటుతో మృతి

image

జమ్మికుంట-కరీంనగర్ వెళ్తున్న బస్సులో విషాదం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. వీణవంక మండలం రెడ్డిపల్లికి చెందిన ఓదెలు అనే వ్యక్తి బస్సెక్కి కరీంనగర్ వెళ్తున్నాడు. ఈ క్రమంలో బస్సులోనే గుండెపోటుతో మృతిచెందాడు. కరీంనగర్ చేరుకున్న అనంతరం బస్సు కండక్టర్ ఆ వ్యక్తి మృతి చెందినట్టు గుర్తించారు. మృతుడు కరీంనగర్ ICICI బ్యాంకులో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నాడు.

Similar News

News March 11, 2026

తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక

image

ఉగాది ఆస్థానం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో 17న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఆ రోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు, అష్టదళ పాదపద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. 19న ఉగాది ఆస్థానం సందర్భంగా ప్రొటోకాల్ ప్రముఖులకు మినహా విఐపీ బ్రేక్ దర్శనాలు క్యాన్సిల్ చేసింది. 18వ తేదీ వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు తీసుకోరు.

News March 11, 2026

శ్రీకాకుళం: కొనసాగుతున్న ఏసీబీ దాడులు

image

రాష్ట్ర వ్యాప్త దాడుల్లో భాగంగా శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ సెక్షన్లో ఏసీబీ అధికారులు మంగళవారం విస్తృతంగా తనిఖీలు చేసిన విషయం తెలిసిందే. బుధవారం సైతం ఏసీబీ సీఐలు రమణ, భాస్కర్ రావుతో కూడిన బృందం పట్టణంలో టౌన్ ప్లానింగ్ సెక్షన్ అనుమతులు ఇచ్చిన భవనాలు, నిర్మాణ నిబంధనలు వంటివి పరిశీలిస్తున్నారు. రాష్ట్ర ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించనున్నట్లు సమాచారం.

News March 11, 2026

వివేకా హత్య కేసు.. సునీత పిటిషన్ల కొట్టివేత

image

AP: దివంగత ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన కూతురు సునీతా రెడ్డికి చుక్కెదురైంది. ఎంపీ అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి సహా పలువురి బెయిల్ రద్దు చేయాలంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇప్పటికే మూడో సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్ దాఖలు చేశామని, తదుపరి దర్యాప్తు అవసరం లేదని సీబీఐ కోర్టుకు తెలిపింది. విచారణ త్వరగా పూర్తి చేయాలని ట్రయల్ కోర్టును SC ఆదేశించింది.