News April 23, 2025
వీరయ్య చౌదరి ఒంటిపై 53 కత్తిపోట్లు: CM

వీరయ్య చౌదరి లాంటి నేతను కోల్పోవడం చాలా బాధాకరమని సీఎం చంద్రబాబు అన్నారు. అమ్మనబ్రోలులో ఆయన మాట్లాడుతూ.. ‘నారా లోకేశ్, అమరావతి రైతుల పాదయాత్రలో వీరయ్య కీలకంగా ఉన్నారు. ఆయన మృతిని జీర్ణించుకోలేకపోతున్నా. వీరయ్య ఒంటిపై 53 కత్తిపోట్లు ఉన్నాయి. ఈ ఘటన వెనుక ఎవరున్నా వదిలిపెట్టను. ఎక్కడ దాక్కున్నా లాక్కొని వస్తా’ అని సీఎం హెచ్చరించారు.
Similar News
News March 12, 2026
ప్రకాశం: వడగాల్పుల వేళ ముందస్తు చర్యలు

ప్రకాశం జిల్లాలో వడగాల్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు జిల్లా కలెక్టర్ రాజాబాబు అధికారులను అప్రమత్తం చేశారు. ఎండల కారణంగా ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉపాధి హామీ పనుల సమయాల్లో మార్పులు చేయాలని, మధ్యాహ్నం పనులు నిలిపివేయాలని ఆదేశించారు. గ్రామాల్లో తాగునీటి బోర్లు మరమ్మతు చేసి, నీటి కొరత లేకుండా చూడాలని అన్నారు.
News March 11, 2026
రేపు కనిగిరిలో జాబ్ మేళా..!

కనిగిరిలోని అమరావతి గ్రౌండ్‌లో రేపు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే ఉగ్ర బుధవారం తెలిపారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ ,బీ.టెక్, తదితర కోర్సులు చదివిన నిరుద్యోగులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చన్నారు. 18 నుంచి 26 సంవత్సరాల లోపు వారు ఆధార్ కార్డు, టీసీ, మార్క్ లిస్ట్, 2 పాస్ ఫోర్ట్ సైజ్ ఫొటోలతో హాజరుకావాలని సూచించారు.
News March 11, 2026
ప్రకాశం: వడగాల్పులపై ముందస్తు చర్యలు