News March 4, 2025
వీరవల్లిపాలెంలో సీరియల్ షూటింగ్

అయినవిల్లి మండలం వీరవల్లిపాలెంలో మంగళవారం మామ కూతురు మరదలా షూటింగ్ జరిగింది. షూటింగ్ చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీగా జనం రావడంతో సందడి నెలకొంది. ఈ సీరియల్‌లో హీరోగా బాలు, హీరోయిన్‌గా లాస్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రొడ్యూసర్ నాగార్జున, డైరెక్టర్ శేఖర్ ఆధ్వర్యంలో షూటింగ్ జరుగుతుంది. అయినవిల్లి పరిసర ప్రాంతాల్లో వారం రోజులు ఈ చిత్రం షూటింగ్ జరుగుతుందని యూనిట్ తెలిపింది.
Similar News
News December 16, 2025
డేంజర్‌లో హైదరాబాద్

హైదరాబాదులో ఎయిర్ క్వాలిటీ డేంజర్ లెవెల్‌కి చేరుకుంది. ఎయిర్ పొల్యూషన్, చెత్తాచెదారం, పొగ మంచు, వాహనాల పొగ కారణంగా ఎయిర్ క్వాలిటీ క్షీణిస్తోంది. డబుల్ డిజిట్‌లో ఉండాల్సిన ఎయిర్ క్వాలిటీ ట్రిపుల్ డిజిట్‌లోకి చేరుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ 220 ఎయిర్ క్వాలిటీ ఉంది. అంటే చాలా మంది జనాలు అనారోగ్య బారిన పడటమే కాకుండా ఆస్తమా వాళ్లకు ప్రాణ ముప్పు ఉంటుంది.
News December 16, 2025
నేడు విజయవాడకు రానున్న YS జగన్.. షెడ్యూల్ ఇదే.!

మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి నేడు విజయవాడలో పర్యటించనున్నారు. బెంగళూరు నుంచి మధ్యాహ్నం 12 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో భవానీపురం జ్యోతినగర్‌కు వచ్చి, ఇటీవల 42 ఫ్లాట్లు కూల్చివేసిన ప్రాంతాన్ని పరిశీలించనున్నారు. అనంతరం ఆయన బాధితులతో మాట్లాడతారు. జగన్ పర్యటన నేపథ్యంలో వైసీపీ శ్రేణులు స్వాగత ఏర్పాట్లు పూర్తిచేశాయి.
News December 16, 2025
గిరి ప్రదిక్షిణ చేసిన వారికి ఉచిత దర్శనం టోకెన్లు

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా ఈరోజు గిరిప్రదక్షిణ చేసిన వారికి ఉచిత దర్శనం టోకెన్లు ఇస్తున్నారు. స్వామివారి నిజాభిషేకము అనంతరం గిరి ప్రదక్షిణ చేసిన భక్తులకు, సామాన్యులకు దర్శనం కల్పిస్తారు. టోకెన్లు అందజేయడంతో భక్తులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.


