News August 20, 2025
వెదిర హెచ్‌ఎంకు షోకాజ్ నోటీసులు

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర ఉన్నత పాఠశాల మధ్యాహ్న భోజనంలో కందిపప్పు వాడకుండా కేవలం నీళ్లతో సాంబార్ వడ్డిస్తున్నారని డీఈఓ చైతన్య జైనీకి ఫిర్యాదు అందింది. ఆయన ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించిన అధికారులు, నాణ్యత లేని భోజనం వడ్డిస్తున్నారని నిర్ధారించారు. దీంతో ప్రధానోపాధ్యాయురాలు సరళాదేవికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ చర్య పట్ల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News January 17, 2026
పొగమంచు తీవ్రత.. ఉ.8 గంటల తర్వాతే బయటికి రావాలి!

AP: రాష్ట్రంలో రేపు ఉ.8 గంటల వరకు పొగమంచు ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, ఏలూరు, తూ.గో, ప.గో జిల్లాల్లో తీవ్రత అధికంగా ఉంటుందని వెల్లడించింది. పండగకొచ్చి వాహనాల్లో తిరుగు ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. పూర్తిగా పొగమంచు తొలగిపోయాకే బయటికి రావాలంది. అటు TGలోనూ కొన్ని ప్రాంతాల్లో పొగమంచు వల్ల వాహన రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది.
News January 17, 2026
కొత్తగూడెం తొలి మేయర్ పీఠం ఆ వర్గానికే..

కొత్తగూడెం మున్సిపాలిటీ కార్పొరేషన్‌గా మారిన తర్వాత తొలి ఎన్నికల్లో మేయర్ పీఠం ఎస్టీకి కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో మెజారిటీ జనాభా ఏజెన్సీ వాసులు కావడంతో, జనాభా ప్రాతిపదికన ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో తొలిసారిగా ఒక గిరిజన బిడ్డ మేయర్ పీఠాన్ని అధిష్టించనున్నారు. ఏజెన్సీ ప్రాంత వాసుల చిరకాల కోరిక నెరవేరడంతో గిరిజన సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
News January 17, 2026
BCCI అబ్జర్వర్‌గా కృష్ణా జిల్లా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ

ఈ నెల 21న నాగపూర్‌లో జరిగే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ తొలి టీ–20 మ్యాచ్‌కు BCCI అబ్జర్వర్‌గా కృష్ణా జిల్లా క్రికెట్ అసోసియేషన్ (KDCA) సెక్రటరీ ఎం. రవీంద్ర చౌదరి నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆయనకు అభినందనలు తెలిపింది. గత 40 సంవత్సరాలుగా క్రికెట్‌కు అందిస్తున్న సేవలకు ఇది తగిన గుర్తింపుగా క్రికెట్ అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.


