News February 15, 2025

వెలిగండ్ల మండలంలో సూపర్‌వైజర్ ఆత్మహత్య

image

వెలిగండ్ల మండలంలోని పద్మాపురంలో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం లేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నేషనల్ హైవే ఫైవ్‌లో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న ఏనుగు ప్రతాపరెడ్డి శనివారం ఇంటి ఆవరణలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న సీఐ భీమా నాయక్, ఎస్ఐ మధుసూదన్ రావు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News April 20, 2026

మైనర్లకు వాహనాలు ఇచ్చేవారిపై కేసులు.. జాగ్రత్త: SP

image

ప్రకాశం జిల్లా SP మైనర్ డ్రైవింగ్‌పై కఠిన హెచ్చరికలు జారీ చేశారు. 18 ఏళ్లలోపు వారికి వాహనాలు ఇవ్వడం చట్ట విరుద్ధమని, పట్టుబడితే తల్లిదండ్రులు, వాహన యజమానులపై కేసులు నమోదుచేసి జరిమానాలు, జైలు శిక్ష విధిస్తామని తెలిపారు. ట్రాఫిక్ నియమాలు తెలియక వాహనాలు నడపడం ప్రమాదాలకు దారితీస్తోందన్నారు. హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, అతివేగం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయరాదని SP సూచించారు.

News April 20, 2026

ప్రకాశం: పరిష్కార వేదిక సమయంలో మార్పులు

image

ఒంగోలులో సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే నిర్వహిస్తామని DRO ఓబులేసు ప్రకటించారు. జిల్లాలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌కు అర్జీలు సమర్పించేవారు ఈ సమయంలోనే ఇచ్చి 12.30 గంటలకల్లా తిరిగి నివాసగృహాలకు చేరుకోవాలని సూచించారు.