News February 25, 2025
వెలుగోడు: భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్యాయత్నం

వెలుగోడులోని గాంధీ నగర్‌కు చెందిన వజీద్ అనే వ్యక్తి తన భార్య కాపురానికి రాలేదన్న మనస్తాపంతో ఆత్మహత్యకు యత్నించిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా తొమ్మిది నెలలుగా అతని భార్య పుట్టింట్లో ఉంటోంది. ఈ విషయంపై ఆయన పలుసార్లు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు.
Similar News
News March 21, 2025
SRCL: CM దిష్టిబొమ్మ దహనం.. 15 మందిపై కేసు

చందుర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నేతలు రాస్తారోకో చేపట్టి, సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసిన ఘటనలో 15 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఈనెల 16న చందుర్తి మండల కేంద్రంలో అనుమతి లేకుండా రాస్తారోకో చేపట్టి సీఎం దిష్టిబొమ్మను దహనం చేసిన ఘటనలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఎల్లయ్య, మాజీ ఎంపీపీ పెంటయ్య, మాజీ మార్కెట్ ఛైర్మన్ డప్పుల అశోక్ సహా పలువురిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు.
News March 21, 2025
ఏలూరు జిల్లాలో ఠారెత్తిస్తున్న ఎండలు

ఏలూరు జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరుగుతుండటంతో ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. జంగారెడ్డిగూడెంలో గురువారం అత్యధికంగా 40.72 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. చాలా మండలాల్లో ఉష్ణోగ్రతలు 37 డిగ్రీలు నమోదయ్యాయి. ఇవాళ కూడా అన్ని మండలాల్లో 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానున్నట్లు విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. వడదెబ్బ తగలకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
News March 21, 2025
కార్యకర్తల సమస్యలు తెలుసుకోవాలి: సీఎం చంద్రబాబు

AP: ప్రతి బుధవారం నియోజకవర్గ స్థాయిలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించాలని ఎమ్మెల్యేలు, పార్టీ ఇంఛార్జ్‌లను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశించారు. వారి సమస్యలు తెలుసుకొని పరిష్కరించేలా కృషి చేయాలని తెలిపారు. అదే రోజు గ్రీవెన్స్ నిర్వహించి ప్రజల నుంచి వినతులు తీసుకోవాలన్నారు. ఇంఛార్జ్ మంత్రులు తమకు కేటాయించిన జిల్లాలో నెలకు 2 రోజులు తప్పనిసరిగా పర్యటించాలని సీఎం అన్నారు.