News February 11, 2025
వెల్దండ మండలంలో 12న మంత్రి సీతక్క పర్యటన

వెల్దండ మండలంలో ఈ నెల 12న పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పర్యటించనున్నారు. వెల్దండ నుంచి రాయచూర్ వరకు చేపట్టబోయే బీటీ రోడ్డు నిర్మాణ పనులకు స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తో కలిసి ఆమె భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన చేస్తారు. అనంతరం నియోజకవర్గంలో జరిగే వివిధ కార్యక్రమాలలో మంత్రి పాల్గొంటారు. సీతక్క పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు చేశారు.
Similar News
News February 16, 2026
రంజాన్.. నగరానికి వచ్చేసింది పోషకాల ఖర్జూర్

రంజాన్ మాసంలో ఉపసవాసమున్న వారు ఇష్టపడేది ఖర్జూర్.. ఉపవాసం ముగించేటపుడు ఖర్జూర్‌ను తప్పకుండా తీసుకుంటారు. ఈ 4 రోజుల్లోనే నగరానికి దాదాపు 3వేల టన్నుల విదేశీ ఖర్జూర్ దిగుమతి అయిందని వ్యాపారులు చెబుతున్నారు. దాదాపు 100 రకాల ఖర్జూరం సిటీలో అందుబాటులో ఉంది. రకాన్ని బట్టి కిలో రూ.100 నుంచి రూ.2,200 వరకు ఉంటుంది. ఈ నెల 19 నుంచి రంజాన్ మాసం ప్రారంభమవుతుందని సమాచారం.
News February 16, 2026
జనగామ మున్సిపాలిటీ కార్యాలయ పరిధిలో నిషేధాజ్ఞలు

జనగామ మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఎంపిక నేపథ్యంలో జనగామ మున్సిపల్ కార్యాలయం వద్ద భద్రత ఏర్పాటు చేసినట్లు CP సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. మున్సిపల్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో బీఎన్‌ఎస్ 163 ప్రకారం నిషేధాజ్ఞలు విధిస్తున్నట్లు ప్రకటించారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బుధవారం ఉదయం 6 గంటల వరకు ఇవి అమలులో ఉంటాయని, ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటం నేరమని హెచ్చరించారు.
News February 16, 2026
కోదాడ: లాకప్ డెత్ బాధ్యులపై చర్యలు తీసుకోవాలి: జాతీయ ఎస్సీ కమిషన్

దళితుల రక్షణకు కమిషన్ కట్టుబడి ఉందని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రామచంద్రరావు అన్నారు. కోదాడ లాకప్ డెత్ బాధితుడు రాజేశ్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఈ కేసులో నిర్లక్ష్యం వహించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని, 10 రోజుల్లో రీ-పోస్టుమార్టం నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. బాధిత కుటుంబానికి పెన్షన్, ఇల్లు, మూడు ఎకరాల భూమి అందజేస్తామని హామీ ఇచ్చారు.


