News November 30, 2025
వేంపల్లిలో విషాదం.. గర్భిణీతో పాటు శిశువు మృతి

వేంపల్లిలోని పుల్లయ్య తోటలో విషాదం నెలకొంది. వల్లే భూదేవి (27) అనే గర్భిణీ ఆదివారం మిద్దె పైనుంచి ప్రమాదవశాత్తు జారి కిందపడి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇంట్లో ఉన్న పాపను పైకి రమ్మని పిలిచే క్రమంలో అకస్మాత్తుగా కళ్లు తిరిగి కింద పడటంతో మృతి చెందిందన్నారు. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించగా.. ఆమెతో పాటు గర్భంలో ఉన్న శిశువు కూడా మృతి చెందింది. విషయం తెలుసుకున్న వారంతా కంటతడిపెట్టారు.
Similar News
News February 17, 2026
నెల్లూరులో 15 ఉద్యోగాలకు నోటిఫికేషన్

నెల్లూరు DMHO 15 కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి డిగ్రీ (స్పీచ్ అండ్ లాంగ్వేజ్ పాథాలజీ), పీజీ(చైల్డ్ సైకాలజీ), DMLT, BSc MLT, LLB, టెన్త్ అర్హతతో పాటు పని అనుభవం గలవారు రేపటి వరకు ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 42 ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. వెబ్‌సైట్: https://spsnellore.ap.gov.in
News February 17, 2026
పుంగనూరు: బైక్‌ను ఢీకొని చెరువులో దూసుకెళ్లిన ఆటో

పుంగనూరు మండలం గడ్డురుచెరువు వద్ద పుంగనూరు వైపు వెళ్తున్న బైక్‌ని గొల్లపల్లి వెళ్తున్న ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో గొర్రెల వాలెప్ప, ప్రమీల, ఆటో డ్రైవర్ అంజప్ప గాయపడ్డారు. కాగా బైకును ఢీకొన్న ఆటో చెరువులోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో గాయపడ్డ వారిని పుంగనూరు ఏరియా ఆసుపత్రి తరలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News February 17, 2026
జాతీయ స్థాయిలో మెరిసిన కుబీర్ కుర్రోడు

నిన్న విడుదలైన జేఈఈ మెయిన్స్‌లో దార్ కుబీర్‌కు చెందిన తోకల చంద్రకాంత్ 99.46% పర్సంటైల్ సాధించాడు. ఇతడు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. రైతు కుటుంబంలో పుట్టి ఉత్తమ మార్కులు సాధించడంతో కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్థులు చంద్రకాంత్‌ను అభినందిస్తున్నారు. చంద్రకాంత్ చిన్నతనం నుంచే చదువులో చురుకుగా ఉన్నాడని తండ్రి తోకల మారుతి తెలిపారు.


