News September 13, 2025

వేధింపుల వల్లే హసీనా మృతి: తండ్రి ఫిర్యాదు

image

పెద్దకడబూరు మండలం మేకడోనలో శుక్రవారం విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన హసీనా కుటుంబ కలహాలతో పురుగు మందు తాగి మృతి చెందింది. హసీనాకు ముగ్గురు సంతానం. ఆమె మృతితో ముగ్గురు చిన్నారులు అనాథలుగా మారారు. తమ కూతురి మరణానికి అల్లుడే కారణమని హసీనా తండ్రి మోహినుద్దీన్ సాబ్ పెద్దకడబూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దాదాపు 3 ఏళ్లుగా తన కూతురుని వేధించేవాడని పేర్కొన్నారు.

Similar News

News December 6, 2025

ADB: సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు వద్దు: ఎస్పీ

image

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలో సున్నితమైన వాతావరణం నెలకొంటుందని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సోషల్ మీడియాలో వర్గాలను రెచ్చగొట్టేలా పోస్టులు, వ్యాఖ్యలు చేసిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించిన వారిపై పోలీసు చర్యలు ఉంటాయన్నారు.

News December 6, 2025

విశాఖ: అవినీతిపై ప్రశ్నించిన GVMC స్థాయి సంఘం

image

GVMC స్థాయి సంఘం ఛైర్మన్ శ్రీనివాస్ రావు అధ్యక్షతన శనివారం సమావేశం నిర్వహించారు. 287 అంశాలపై చర్చించగా, అవినీతికి ఆస్కారం ఉన్న 34 ప్రధాన అంశాలపై సభ్యులు, ఛైర్మన్ అభ్యంతరాలు లేవనెత్తారు. అధికారులు సరైన సమాధానాలు ఇవ్వకపోవడంతో ఆ అంశాలను వాయిదా వేశారు. యోగాంధ్ర నిర్వహణలో బీచ్ రోడ్డులో రంగుల ఖర్చులపై విచారణ చేపట్టాలని ఛైర్మన్ ఆదేశించారు. హెలిప్యాడ్ రాళ్ల తొలగింపు తదితర ఖర్చుల అంశాలను వాయిదా వేశారు.

News December 6, 2025

అభిషేక్ ఊచకోత.. ఈ ఏడాది 100 సిక్సర్లు

image

విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించారు. టీ20ల్లో ఒకే క్యాలండర్ ఇయర్‌లో 100 సిక్సర్లు(36 ఇన్నింగ్స్‌లు) బాదిన తొలి ఇండియన్‌గా నిలిచారు. ఇవాళ SMATలో సర్వీసెస్‌తో మ్యాచులో పంజాబ్ తరఫున ఆడిన అభిషేక్ 3 సిక్సర్లు బాది ఈ ఫీట్‌ను అందుకున్నారు. ఓవరాల్‌గా నికోలస్ పూరన్ గతేడాది 170 సిక్సర్లు బాదారు. ఇక ఈ ఏడాది T20ల్లో అభి 1,499 రన్స్ చేయగా వాటిలో 3 సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలు ఉండటం విశేషం.