News February 18, 2025

వేములవాడలో 3 రోజులు జాతర.. మీరు వెళుతున్నారా? 

image

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి జాతర మహోత్సవాలు ఈనెల 25 నుంచి 27 వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. 25న రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ ఆధ్వర్యంలో స్వామివారికి వస్త్రాలంకరణ, కోడె మొక్కులు నిర్వహిస్తారు. 26న మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. 27న స్వామివారి ఆర్జిత సేవలు ఉంటాయని ఆలయ అధికారులు తెలిపారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

Similar News

News April 14, 2026

ప్రెగ్నెన్సీలో మందులతో జాగ్రత్త

image

గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం వరకు మహిళలు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ సమయంలో మందుల వాడకంపై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు. దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన మందులు, యాంటీబయాటిక్స్ వాడే ముందు వైద్యుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి. ఇష్టం వచ్చినట్టు మందులు కొనుక్కొని వాడకూడదు. డాక్టర్లు ప్రిస్క్రైబ్​ చేస్తేనే వాడాలని చెబుతున్నారు.

News April 14, 2026

నేను రఫ్ డాడీని: రామ్ చరణ్

image

పిల్లలే తన ప్రాణమని, వాళ్లు లేకపోతే ఇల్లు బోసిపోయినట్లు ఉంటుందని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అన్నారు. ‘నేను రఫ్ డాడీని. పిల్లల్ని గంతులేయనివ్వడం, ఎక్కనివ్వడం, రిస్క్ తీసుకోనివ్వడం వంటివి చేస్తాను. వారితో సమయం గడిపే తండ్రిగా ఉండాలనుకుంటా. నా ప్రపంచాన్ని కాస్త చిన్నదిగా, పరిమితంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తా’ అని Esquire India ఇంటర్వ్యూలో చెప్పారు. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.

News April 14, 2026

జనగామ: ఇంటర్‌‌లో టైలర్‌ కూతురు భవానికి 988 మార్కులు!

image

ఇంటర్మీడియట్ ఫలితాల్లో జనగామ(D) చిల్పూర్(M) చిన్న పెండ్యాలకు చెందిన పేరాల భవాని అద్భుత ప్రతిభ కనబరిచింది. తండ్రి ప్రభాకర్ టైలరింగ్ చేస్తూ చదివిస్తుండగా, తండ్రి కష్టాన్ని గుర్తించిన భవాని టీఎస్‌ఆర్‌జేసీలో కష్టపడి చదివి 1000కి 988 మార్కులు సాధించింది. నిరుపేద కుటుంబం నుంచి వచ్చి అత్యధిక మార్కులు సాధించిన భవానిని గ్రామస్థులు, పలువురు ప్రముఖులు అభినందించారు.