News December 2, 2025

వేములవాడ, కరీంనగర్ నుంచి అరుణాచలానికి RTC బస్సు

image

అరుణాచలానికి వేములవాడ నుంచి SL బస్సును ఏర్పాటుచేసినట్లు KNR-2 DM శ్రీనివాస్ తెలిపారు. DEC 6న VMLD నుంచి మ.12:30కు బయలుదేరి KNR మీదుగా DEC 7న ఉ. కాణిపాకం చేరుకుంటుందన్నారు. తర్వాత కంచి టెంపుల్, వెల్లూరు గోల్డెన్ టెంపుల్ దర్శనం అనంతరం, DEC 8న వేకువజామున అరుణాచలం చేరుకుంటుంది. DEC 8న రాత్రి బయలుదేరి, DEC 9న ఉ. జోగులాంబ గద్వాల్ అమ్మవారి దర్శనానంతరం అదే రోజు రాత్రి KNR మీదుగా VMLDకు చేరుకుంటుందన్నారు.

Similar News

News February 7, 2026

ఉయ్యురు: శిడిబండిలో ఆ కులానికే ప్రత్యేకం..!

image

ఉయ్యూరు వీరమ్మ ఉత్సవాలలో భాగంగా నేడు 11వ రోజు శిడిబండి ఉత్సవం నిర్వహించనున్నారు. ఈ ఉత్సవంలో ఎస్సీ కులానికి చెందిన యువకుడిని కూర్చోబెట్టడానికి వెనక పెద్ద కారణం ఉంది. వీరమ్మ తల్లి సతీ సహగమనానికి గుండం తవ్వేందుకు ఉప్పర కులస్తులు ముందుకు రాకపోవడంతో మాదిగ వర్గానికి చెందిన వారు తవ్వినట్లు ప్రతీక. అందుకే శిడి బండి ఉత్సవం రోజున ఆ కులానికి ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడిందని స్థానికులు చెబుతున్నారు.

News February 7, 2026

సోమిరెడ్డికి కాకాణి సవాల్

image

నెల్లూరు జిల్లా ఇరిగేషన్ శాఖ అవినీతికి అడ్డాగా మారిందని మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. రైతులను అడ్డం పెట్టుకుని పనులు చేయకుండానే కోట్ల రూపాయల బిల్లులు దోచుకున్నారన్నారు. ఈ అక్రమాలపై సీఎంకు లేఖ రాసినా స్పందన లేదని మండిపడ్డారు. అవినీతి ప్రశ్నిస్తే దాడులు, బెదిరింపులు చేస్తున్నారని, విజిలెన్స్ విచారణకు సిద్ధమా అని సోమిరెడ్డికి సవాల్ విసిరారు.

News February 7, 2026

‘తులం బంగారం, కళ్యాణ లక్ష్మి’ ఊసేలేదు: హరీశ్

image

TG: పెన్షన్ల పెంపు, మహాలక్ష్మి పథకం అమలు చేయకుండా సీఎం రేవంత్ ప్రజలను మోసం చేశారని BRS MLA హరీశ్ రావు విమర్శించారు. తులం బంగారం, కళ్యాణ లక్ష్మి చెక్కుల ఊసే లేదన్నారు. గజ్వేల్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ‘రేవంత్ వచ్చాక ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయలేదు. కేసీఆర్ ఇచ్చిన అన్ని స్కీములను ఆయన రద్దు చేశారు. ఇక కమలం గుర్తుకు ఓటేయడం అంటే మోరీలో వేయడమే’ అని ఫైరయ్యారు.