News November 9, 2025
వేములవాడ: కళ తప్పిన కళామందిరం..!

సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కోసం కోట్లాది రూపాయలతో నిర్మించిన వేములవాడ పట్టణంలోని సినారే కళామందిరం నిరుపయోగంగా మారింది. ప్రముఖ కవి, దివంగత డాక్టర్ సీ.నారాయణరెడ్డి రాజ్యసభ సభ్యుడి హోదాలో నిధులు కేటాయించడంతో మండల పరిషత్ ఆవరణలో నిర్మించిన ఈ భవనాన్ని పట్టించుకునే నాథుడే కరవయ్యాడు. కళాకారుల కోసం నిర్మించిన ఈ భవనంలో కొంతకాలంగా ఒక్కటంటే ఒక్క సాంస్కృతిక కార్యక్రమమూ జరగలేదంటే అతిశయోక్తి కాదేమో.
Similar News
News January 19, 2026
గద్వాల్: సింగోటం జాతరకి వెళ్లి వస్తుండగా ప్రమాదం

కర్నూలు జిల్లా పంచలింగాల గ్రామానికి చెందిన 20 మంది భక్తులు సింగోటం జాతరలో నరసింహస్వామి వారిని దర్శించుకుని ట్రాక్టర్‌లో తిరిగి ఎర్రవల్లి మండలం వేముల స్టేజి దగ్గర సోమవారం తెల్లవారుజామున వెనుక నుంచి నుంచి డీసీఎం ఢీకొంది. ఈ ఘటనలో ఖాజా గౌడ్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. 108 వాహనం ద్వారా కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
News January 19, 2026
పంతం పక్కనబెట్టి ఈ పనులు నేర్చుకోండోయ్!

నగరాలు, పట్టణాల్లో ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లకు విపరీతమైన <<18865388>>డిమాండ్<<>> నెలకొంది. చిన్నపని చేసినా రూ.500-1,000 వరకు తీసుకుంటున్నారు. అయితే ఇంత డిమాండ్ ఉన్నప్పటికీ నిరుద్యోగులు ఆ పనులు చేసేందుకు ఇష్టపడట్లేదు. సొసైటీలో తమ హోదా తగ్గుతుందని, వైట్ కాలర్ జాబ్స్ మాత్రమే చేస్తామంటున్నారు. ఆ పంతం పక్కనబెట్టి స్కిల్స్ నేర్చుకుంటే సాఫ్ట్‌వేర్ జాబ్ కంటే ఎక్కువ సంపాదించవచ్చని నిపుణుల మాట. ఏమంటారు?
News January 19, 2026
బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

<


