News November 5, 2025

వేములవాడ: దర్శనాల నిలిపివేతపై పుకార్లు.. పోటెత్తిన భక్తులు

image

తెలంగాణలోనే అతిపెద్ద శైవక్షేత్రం వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి దేవస్థానంలో త్వరలో దర్శనాలు నిలిపివేస్తారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో రాజన్నను దర్శించుకుని తరించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఒకవైపు కార్తీక మాసం కావడం, మరోవైపు దర్శనాల నిలిపివేతపై రకరకాలుగా ప్రచారం జరుగుతుండడంతో భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. దీంతో రాజన్న క్షేత్రం జాతరను తలపిస్తోంది.

Similar News

News January 22, 2026

కదిరిలో మహిళ ఆత్మహత్య

image

కదిరిలో మున్ని అనే మహిళ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త వేధింపులు తట్టుకోలేక ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ నారాయణరెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.

News January 22, 2026

కరీంనగర్ నూతన కలెక్టరేట్ ప్రారంభం ఎప్పుడో ?

image

KNR నూతన కలెక్టరేట్ ప్రారంభం మరోసారి ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సంక్రాంతికి సీఎం చేతుల మీదుగా ప్రారంభం కావాల్సినా కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు. ఇప్పటికే 90 శాతం పనులు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో అద్దె భవనాలు ఖాళీ చేయాలని, వివిధ శాఖల్లో అందుబాటులో ఉన్న భవనాల వివరాలు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో నూతన కలెక్టరేట్ ప్రారంభం మరింత వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి.

News January 22, 2026

తిరుమలకు 2.5లక్షల మంది వస్తారని అంచనా

image

రథసప్తమి సందర్భంగా తిరుమలలో ఈనెల 25న మలయప్ప స్వామి ఏడు వాహనసేవలపై దర్శనమిస్తారని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. ఉదయం 5:30కు సూర్యప్రభ వాహనంతో ప్రారంభమై రాత్రి 8కు చంద్రప్రభ వాహనంతో సేవలు ముగుస్తాయి.14 రకాల అన్నప్రసాదాలను 3,700 మంది శ్రీవారి సేవకులతో పంపిణీ చేస్తారు. 1,260 పోలీసులు,1,200 విజిలెన్స్ సిబ్బందితో భద్రత ఏర్పాటు చేశారు. సుమారు 2.5 లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా.