News October 6, 2025
వేములవాడ: నేడు క్షీర చంద్ర దర్శనం.. కోజా గరి పూర్ణిమ వ్రతం

దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో సోమవారం రాత్రి క్షీర చంద్ర దర్శనం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. శ్రీస్వామివారి ఆలయంలో ప్రతి సంవత్సరం ఆశ్వీజ శుద్ధ చతుర్దశి ఉపరి పూర్ణిమ రోజున క్షీరచంద్ర దర్శనం సందర్భంగా నిశీపూజ ఉంటుదన్నారు. రాత్రి 10.05 నిమిషాల నుంచి కోజాగరి పూర్ణిమ వ్రతం (మహాలక్ష్మి పూజ క్షీరచంద్రపూజ) అనంతరం క్షీరచంద్ర దర్శనం జరుగుతుందన్నారు.
Similar News
News January 19, 2026
ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావుకు నోటీసులు

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి, BRS నేత హరీశ్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది. రేపు ఉ.11 గంటలకు జూబ్లీహిల్స్ పీఎస్‌లో విచారణకు రావాలని అందులో పేర్కొంది. హరీశ్ పాత్రపై ఓ ప్రైవేటు ఛానెల్ ఎండీ స్టేట్‌మెంట్ మేరకు ఈ నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపిన ఈ కేసులో BRS కీలక నేతకు నోటీసులు రావడం సంచలనంగా మారింది. అయితే ఆయన విచారణకు హాజరవుతారా లేదా? అనేది ఆసక్తిగా మారింది.
News January 19, 2026
జగిత్యాల: వేసవికి ముందస్తు తాగునీటి ప్రణాళికలు

వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకుని తాగునీటి ప్రణాళికలను ముందస్తుగా అమలు చేయాలని జగిత్యాల అదనపు కలెక్టర్ బి. రాజగౌడ్ ఆదేశించారు. జల్ జీవన్ మిషన్ అమలుపై నిర్వహించిన జిల్లా నీటి, పారిశుధ్య కమిటీ సమావేశంలో నీటి సరఫరా, నాణ్యత, ఎఫ్‌హెచ్‌టీసీల పురోగతి, ఆపరేషన్ పనులను సమీక్షించారు. ఫిర్యాదులను వెంటనే పరిష్కరించి ప్రతి కుటుంబానికి సురక్షిత తాగునీరు అందించాలని సూచించారు.
News January 19, 2026
నల్గొండ: ఇంటర్ కాలేజీలకు నిధులు మంజూరు

నల్గొండ జిల్లాలోని 13 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సైన్స్ ప్రాక్టికల్ పరికరాల కొనుగోలుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఒక్కో కళాశాలకు రూ.50,000 చొప్పున మొత్తం రూ.6.50 లక్షలను కేటాయించింది. ఈ పరికరాల సరఫరా కోసం అర్హులైన సంస్థల నుండి కొటేషన్లు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి తెలిపారు. ఆసక్తి గల వారు నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.


