News August 19, 2024
వేములవాడ: ప్రేమ పేరుతో వేధింపులు.. యువతి ఆత్మహత్య
ప్రేమ వేధింపులు తట్టుకోలేక ఓ యువతి మనస్తాపంతో సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి గ్రామానికి చెందిన గీసి శిరీష(20) సూసైడ్ చేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. శిరీష డిగ్రీ పూర్తి చేసి ఇంట్లోనే ఉంటోంది. ఆదివారం పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కాగా, శిరీష అన్నయ్య తన చెల్లిని ప్రేమ పేరుతో ఓ యువకుడు వేధిస్తున్నట్లు వేములవాడ రూరల్ SI మారుతికి ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదైంది.
Similar News
News September 19, 2024
కరీంనగర్: 29న లోక్ అదాలత్
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని కోర్టుల్లో ఈ నెల 29న నేషనల్ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్టు డిస్ట్రిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ వెంకటేశ్ తెలిపారు. జిల్లా కోర్టు ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. లోక్ అదాలత్ ద్వారా రాజీ పడదగిన క్రిమినల్, సివిల్, కుటుంబ తగాదాలకు సంబంధించిన కేసులు ఇరువర్గాల సమ్మతితో పరిష్కరించుకోవచ్చని తెలిపారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News September 19, 2024
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్
@ కోనరావుపేట మండలంలో ఏకలవ్య మోడల్ స్కూల్ ను తనిఖీ చేసిన సిరిసిల్ల కలెక్టర్. @ బీర్పూర్ మండలంలో అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక డంపుల సీజ్. @ ఎల్లారెడ్డిపేట మండలంలో గణేష్ నిమజ్జన ఊరేగింపులో ట్రాక్టర్ కిందపడి యువకుడి మృతి. @ ఇండియన్ ఐకాన్ అవార్డు అందుకున్న కరీంనగర్ జిల్లా వాసి. @ ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ వర్తింపచేయాలని జగిత్యాల కలెక్టర్ కు బిఆర్ఎస్ నాయకులు వినతి.
News September 18, 2024
నిర్దేశించిన గడువులోగా రైస్ డెలివరీ పూర్తి చేయాలి: కలెక్టర్
నిర్దేశించిన గడువులోగా ఖరీఫ్ 2023-24, రబీ సీజన్‌లకు సంబంధించి పెండింగ్ రైస్ డెలివరీని తప్పనిసరిగా పూర్తి చేయాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష మిల్లర్లను ఆదేశించారు. అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్‌తో కలిసి జిల్లాలోని రైస్ మిల్లర్లు, సంభందిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. రైస్ డెలివరీ ఆలస్యం చేస్తున్న రైస్ మిల్లులను అధికారులు క్షేత్ర స్థాయిలో తనిఖీ చేయాలని సూచించారు.