News November 6, 2025

వేములవాడ: ‘బాధ్యతతో మెదులుదాం.. కుటుంబాలకు అండగా నిలుద్దాం’

image

విధి నిర్వహణ సందర్భంగా బాధ్యతతో వ్యవహరించి కుటుంబాలకు అండగా నిలుద్దామని వేములవాడ అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి అన్నారు. వేములవాడ పరిధిలోని వ్యాన్ డ్రైవర్లకు అవగాహన శిబిరం నిర్వహించారు. జాగ్రత్తగా వాహనాలను నడిపి వాహనాలతోపాటు తాము కూడా క్షేమంగా ఇంటికి చేరే విధంగా మసులుకుంటామని ఈ సందర్భంగా వారితో ప్రతిజ్ఞ చేయించారు. వేములవాడ పట్టణ సీఐ వీరప్రసాద్, ట్రాఫిక్ ఎస్ఐ రాజు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Similar News

News January 23, 2026

త్వరలో మరో 2500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు: తుమ్మల

image

2,200 ఇందిరమ్మ ఇళ్లను ఖమ్మం నగరంలో అర్హులైన పేదలకు ఇచ్చామని, త్వరలో మరో 2,500 ఇండ్లు మంజూరుకు చర్యలు చేపడుతున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ప్రభుత్వానికి వీలైనంత వరకు పేద ప్రజల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు కృషి చేస్తుందని చెప్పారు. రూ.13 వేల కోట్లు ఖర్చు చేస్తూ ప్రభుత్వం పేదలకు రేషన్ ద్వారా సన్న బియ్యం సరఫరా చేస్తుందని, పేదలకు ఉచితంగా 200 యూనిట్ల విద్యుత్ అందిస్తున్నామన్నారు.

News January 23, 2026

కలికిరి: ఎల్లుండి మాజీ సీఎం రాక

image

ఉమ్మడి ఏపీ మాజీ సీఎం, బీజేపీ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఈనెల 25న కలికిరికి రానున్నారు. ఉదయం 11గంటలకు హైదరాబాద్‌లో బయల్దేరి మ.12:30 గంటలకు రేణిగుంటకు చేరుకుంటారు. 12:45 గంటలకు చంద్రగిరి మండలం మామండూరులో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 1:45 గంటలకు బయలుదేరి కలికిరి బీజేపీ కార్యాలయానికి సాయంత్రం 3:15గంటలకు చేరుకుంటారు. 26న కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు.

News January 23, 2026

అనకాపల్లి: ‘జాతీయ హరిత ట్రిబ్యునల్ మార్గదర్శకాలను పాటించాలి’

image

జాతీయ హరిత ట్రిబ్యునల్ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. శుక్రవారం అనకాపల్లి కలెక్టరేట్‌లో హరిత ట్రిబ్యునల్ జిల్లాస్థాయి కమిటీ మొదటి సమావేశం నిర్వహించారు. నగరాల్లో చెత్త సేకరణను పక్కాగా అమలు చేయాలన్నారు. మురికి కాలవల్లో నీరు మంచినీటి వనరుల్లో కలవకుండా చూడాలన్నారు. భూగర్భ జలాలు కలుషితం కాకుండా మురుగునీటి శుద్ధి కేంద్రాలు నిర్మించాలన్నారు.