News November 16, 2025

వేములవాడ భీమేశ్వరాలయంలో భక్తుల రద్దీ

image

కార్తీక మాసం చివరి ఆదివారం సందర్భంగా వేములవాడ క్షేత్రంలో భక్తుల రద్దీ పెరిగింది. వరంగల్, హైదరాబాద్, నిజామాబాద్ తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వేములవాడకు తరలివస్తున్నారు. ఈ సందర్భంగా వారు శ్రీ భీమేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. రాజన్నకు మొక్కుకున్న కోడె మొక్కును భీమేశ్వరాలయంలో చెల్లించుకుంటున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

Similar News

News January 17, 2026

ఆదిలాబాద్: భక్తుల ఇంటికే మేడారం ప్రసాదం

image

మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను పురస్కరించుకుని భక్తుల ఇంటికే ప్రసాదం అందించేలా ఏర్పాట్లు చేసినట్లు ఉమ్మడి ADB ఆర్టీసీ ఆర్ఎం భవాని ప్రసాద్ తెలిపారు. ఈ నెల 15 నుంచి ఫిబ్రవరి 5వ తేదీ వరకు అమ్మవారి ప్రసాదాన్ని భక్తులు tgsrtcologistics.co.in వెబ్ సైట్, ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్లలో ప్రసాదాన్ని బుక్ చేసుకోవచ్చన్నారు. అమ్మవార్ల ఫొటో, పసుపు, కుంకుమ, బెల్లం ప్రసాదం అందించడం జరుగుతుందన్నారు.

News January 17, 2026

జపాన్‌ వెకేషన్‌లో అల్లు అర్జున్.. ఫ్యామిలీ పిక్ వైరల్

image

టోక్యోలోని సెన్‌సో-జి ఆలయానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీతో కలిసి వెళ్లారు. భార్య స్నేహా రెడ్డి, కొడుకు అయాన్, కూతురు అర్హతో దిగిన ఫోటోను SMలో ఆయన షేర్ చేశారు. షేర్ చేసిన క్షణాల్లోనే ఈ పిక్‌ను అభిమానులు వైరల్ చేసేశారు. సినిమాలు, ఫ్యామిలీకి సమానంగా టైమ్ కేటాయిస్తూ ఫ్యామిలీ మ్యాన్ అనిపించుకుంటున్నారని కామెంట్స్ పెడుతున్నారు.

News January 17, 2026

పాలమూరు జిల్లా అభివృద్ధి సీఎం బాధ్యత: డీకే అరుణ

image

పాలమూరు జిల్లా బిడ్డగా అభివృద్ధి చేయడం సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత అని ఎంపీ డీకే అరుణ విమర్శించారు. గత సీఎంలు తమ జిల్లాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తున్నారని, ఎక్కువ దృష్టి పెట్టి జిల్లాలో సస్యశాసమలంగా మార్చే బాధ్యత తనపై పూర్తిగా ఉందని సూచించారు. విద్య వైద్యం పై అధిక శ్రద్ధ చూపించి ఉపాధి కల్పన జిల్లాగా పేరు మార్చుకునేలా అభివృద్ధిలో దూసుకొని పోయేలా అడుగులు వేయాలన్నారు.