News November 8, 2025
వేములవాడ రాజన్న కళ్యాణోత్సవంలో CM దంపతులు

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి కళ్యాణోత్సవంలో CM రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. HYD NTR గార్డెన్స్‌లో భక్తి టీవీ కోటి దీపోత్సవం కార్యక్రమంలో భాగంగా స్వామివారి కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు ఆయనకు, ఆయన కుటుంబీకులకు ఆశీర్వచనం అందజేశారు. రాజన్న ఆలయ EO కూడా కళ్యాణంలో పాల్గొన్నారు.
Similar News
News January 23, 2026
విజయవాడ: ప్రేమ పేరుతో బాలికను లోబర్చుకుని మోసం

మైనర్ బాలికను ప్రేమ పేరుతో మోసం చేసిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. క్రీస్తురాజుపురానికి చెందిన చెందిన ఓ బాలిక(15)ను అదే ప్రాంతానికి చెందిన వసంత్ కుమార్ అనే వ్యక్తి ప్రేమ పేరుతో శారీరకంగా లోబర్చుకుని మోసం చేశాడు. ఈ ఘటనపై తల్లి మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడు వసంత్ కుమార్‌పై పోక్సో కేసు నమోదు చేసినట్లు మాచవరం సీఐ వెంకటరమణ గురువారం తెలిపారు.
News January 23, 2026
గ్రామ ప్రియ కోళ్ల గురించి తెలుసా?

గ్రామ ప్రియ కోళ్లు అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో పెంపకానికి అనుకూలంగా ఉంటాయి. చూడటానికి ఆకర్షణీయంగా ఉండే గ్రామ ప్రియ కోళ్లు పెరటి పెంపకానికి ఎంతో అనువైనవి. వీటి గుడ్లు గోధుమ రంగులో ఉంటాయి. ఇవి ఆరు నెలల వయసు వచ్చేసరికే రెండున్నర కేజీల వరకు బరువు పెరుగుతాయి. ఏడాదిలో 250 గుడ్లను పెడతాయి. అధిక వ్యాధినిరోధక శక్తిని కలిగి ఉండటం వల్ల త్వరగా జబ్బుల బారిన పడవని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు.
News January 23, 2026
SKLM: ప్రతి 10ని.లకు ప్రత్యేక బస్సు

రథసప్తమి వేడుకల సందర్భంగా ఈ నెల 25న RTC ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి సి.హెచ్. అప్పల నారాయణ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రయాణీకుల సౌకర్యార్థం, విశాఖ, విజయనగరం, రాజాం, పాలకొండ, బత్తిలి, శ్రీముఖలింగం, పాతపట్నం, టెక్కలి, పలాస నుంచి సాధారణ ఛార్జీలతో నడుస్తాయన్నారు. ప్రతి 10 నిమిషాలకు ప్రత్యేక బస్సులు రాకపోకలు సాగిస్తాయన్నారు.


