News October 4, 2025

వేములవాడ: రాజన్న గుడిలో భక్తుల సందడి.. కోడె మొక్కుల చెల్లింపు

image

తెలంగాణలో ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. తెల్లవారుజాము నుంచే వేలాది మంది భక్తులు తరలివచ్చి క్యూలైన్‌లో స్వామివారి దర్శనానికి బారులు తీరారు. ఆలయ పరిసరాలు స్వామివారి నామస్మరణతో మార్మోగాయి. భక్తులు ధర్మగుండంలో స్నానాలు ఆచరించి, స్వామివారికి కోడె మొక్కులు చెల్లించుకున్నారు. రేపు ఆదివారం కావున రద్దీ మరింత ఎక్కువగా ఉండనుంది.

Similar News

News January 22, 2026

మద్నూర్: GOVT ఆస్పత్రిలో కరెంట్ కట్.. ఏఈ గోపికృష్ణ వివరణ

image

కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలో మరమ్మతులు కారణంగానే <<18926314>>విద్యుత్ సరఫరాలో అంతరాయం<<>> ఏర్పడిందని విద్యుత్ శాఖ ఏఈ గోపికృష్ణ తెలిపారు. గురువారం ‘కరెంటు లేక GOVT ఆస్పత్రిలో ఆపరేషన్లు బంద్’ శీర్షికన Way2Newsలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ప్రజలకు మెరుగైన విద్యుత్ సౌకర్యం అందించేందుకు టీచర్స్ కాలనీలో ట్రాన్స్‌ఫార్మర్‌కు రిపేర్ చేశామని Way2Newsకు తెలిపారు.

News January 22, 2026

సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలి: ఇన్‌ఛార్జ్ కలెక్టర్

image

రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని జిల్లాలో సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఇన్ ఛార్జ్ కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. సీఎం కప్ పోటీల నిర్వహణ, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, సమ్మర్ యాక్షన్ ప్లాన్‌పై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హౌసింగ్, మిషన్ భగీరథ, డీవైఎస్ఓ, మున్సిపల్ కమిషనర్లకు పలు సూచనలు చేశారు.

News January 22, 2026

BREAKING: కామారెడ్డిలో విషాదం

image

కామారెడ్డిలో విషాదం నెలకొంది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యంతో నాలుగు రోజుల నవజాత శిశువు మృతిచెందిందని బాధితులు ఈరోజు తెలిపారు. రామారెడ్డి మండలం రెడ్డిపేట గ్రామానికి చెందిన గంగ జమున ఈనెల 19న ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించగా మగ శిశువు జన్మించారన్నారు. శిశువు తక్కువ బరువు ఉండడంతో పరిశీలనలో ఉంచినప్పటికీ తర్వాత వైద్యులు పట్టించుకోకపోవడంతో చనిపోయాడని ఆరోపించారు.