News August 13, 2025

వేములవాడ: ‘విద్యార్థులు తాత్కాలిక ఆనందాలకు అలవాటు పడవద్దు’

image

విద్యార్థులు తాత్కాలిక ఆనందాలకు అలవాటు పడొద్దని, ప్రభుత్వ విద్యా వనరులను సద్వినియోగం చేసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం సూచించారు. బుధవారం రుద్రవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నశముక్తి భారత్ అభియాన్, మిషన్ పరివర్తనలో భాగంగా ప్రతిజ్ఞ దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేపించారు.

Similar News

News March 12, 2026

అనకాపల్లి: కేజీబీవీల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

కేజీబీవీల్లో ప్రవేశాలకు ఆన్‌‌లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు DEO అప్పారావు నాయుడు బుధవారం తెలిపారు. 6, 11వ తరగతుల ప్రవేశాలతో పాటు 7, 8, 9, 10, 12వ తరగతుల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు ఈనెల 12 నుంచి ఏప్రిల్ 1 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు. అనాథలు, బడి బయట ఉన్నవారు, డ్రాప్ అవుట్స్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, వలస కార్మికులు, తల్లిదండ్రులు ఒక్కరే ఉన్నవారు అర్హులుగా పేర్కొన్నారు.

News March 12, 2026

కామారెడ్డి: భగవద్గీత ముద్రణతో పెళ్లి ఆహ్వాన పత్రిక

image

ప్రస్తుతం మారుతున్న కాలానికి అనుగుణంగా వివాహ ఆహ్వాన పత్రికల రూపకల్పనలో కొత్త పోకడలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా “భగవద్గీత” రూపంలో పెళ్లి పత్రికలను ముద్రించడం ఒక సరికొత్త ఆధ్యాత్మిక ఒరవడికి శ్రీకారం చుట్టారు. కామారెడ్డికి చెందిన ఓ వ్యక్తి తన కుమారుని వివాహానికి ధర్మ ప్రచారం జరగాలని, భగవద్గీత జ్ఞాన ప్రధాన విశిష్టత తెలిసేలా ఆహ్వాన పత్రికను రూపొందించారు. మీకు అలాంటి పత్రికలు వచ్చాయా!

News March 12, 2026

నెల్లూరు జిల్లాలో పెట్రోల్ పట్టడం లేదా…?

image

యుద్ధం ఎఫెక్ట్‌తో నెల్లూరు జిల్లాలో గ్యాస్ డెలివరీ ఆలస్యం అవుతోంది. బుకింగ్ OTPలు రావడం లేదు. కావలిలో కొందరు పెట్రోల్, డీజిల్ రావడం లేదని బంకులు మూసేస్తున్నారని దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు మల్లి ఆరోపించారు. జేసీబీ, మైనింగ్ లారీలకు బ్లాక్ మార్కెట్లో డీజిల్ విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. మీ ఏరియాలోనూ పెట్రోల్ బంకుల్లో ఇలాంటి సమస్య ఉంటే కామెంట్ చేయండి.