News January 11, 2026

వేములవాడ: TGLA క్యాలెండర్ ఆవిష్కరణ

image

తెలంగాణ గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ (TGLA) జిల్లా శాఖ ఆధ్వర్యంలో ముద్రించిన 2026 క్యాలెండర్‌ను వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఆదివారం నాడు వేములవాడలోని తన క్యాంపు కార్యాలయంలో క్యాలెండర్ ఆవిష్కరించి లెక్చరర్లకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీజీఎల్ఏ జిల్లా శాఖ అధ్యక్షుడు ఆర్ లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శి జే.సుమన్ సభ్యులు పాల్గొన్నారు.

Similar News

News January 18, 2026

HYDలో ఆదివారం AQ @189

image

HYDలో ఎయిర్ క్వాలిటీ గత వారంతో పోలిస్తే స్వల్పంగా మెరుగుపడింది. పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల పొగతో నగరంలో కాలుష్యం పెరుగుతూ వస్తోంది. డబుల్ డిజిట్‌లో ఉండే ఎయిర్‌ క్వాలిటీ నగరంలో ఆదివారం తెల్లవారుజామున 189గా నమోదైంది. శ్వాసకోశ వ్యాధులు, సైనసైటిస్ ఉన్నవారితో పాటు ప్రజలు మాస్కులు ధరించాలని డాక్టర్లు సూచిస్తున్నారు. వాహనాల రద్దీ, ఫ్యాక్టరీల నుంచి వెలువడే పొగ తగ్గడంతో HYD ఊపిరితీసుకుంటోంది.

News January 18, 2026

4రోజుల్లో రూ.82కోట్లు కలెక్ట్ చేసిన ‘అనగనగా ఒక రాజు’

image

నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన ‘అనగనగా ఒక రాజు’ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతోంది. సంక్రాంతి కానుకగా ఈనెల 14న విడుదలై 4 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.82కోట్లు (గ్రాస్) వసూలు చేసినట్టు నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్మెంట్స్ ట్వీట్ చేసింది. ‘సంక్రాంతి రారాజు బాక్సాఫీస్ ధమాకా పేలుతూనే ఉంటుంది’ అని క్యాప్షన్ పెట్టింది. మీనాక్షీ చౌదరి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు మారి దర్శకత్వం వహించారు.

News January 18, 2026

గ్రేటర్ HYDలో 20న ఆటోల బంద్!

image

నగర వ్యాప్తంగా జనవరి 20న ఆటోల బంద్‌కు పిలుపునిస్తున్నట్లు మహాత్మా గాంధీ ఆటో డ్రైవర్ల జేఏసీ కన్వీనర్ మహమ్మద్ తెలిపారు. ఉచిత బస్సు పథకంతో ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలకు నిరసనగా, ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద ఆటో డ్రైవర్లతో భారీ ధర్నా చేపడతామని ప్రకటించారు. ప్రభుత్వమే స్పందించి తమ డిమాండ్లు పరిష్కరించాలని ఆయన కోరారు.