News July 6, 2024
వేముల: విద్యార్థులతో సెల్ఫీ దిగిన మాజీ సీఎం జగన్

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నేడు వేముల
మండలంలోని దుగ్గినవారిపల్లి సమీపంలోని ఓ పాఠశాల విద్యార్థులతో జగన్ రెడ్డి సెల్ఫీ దిగారు. అనంతరం
విద్యార్థులను ఆప్యాయంగా పలకరించారు. అనంతరం అక్కడి నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ పులివెందులకు వెళ్లారు.
Similar News
News December 17, 2025
కడప జిల్లాలో ‘ఫేస్ వాష్ అండ్ గో’

కడప ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ‘ఫేస్ వాష్ అండ్ గో’ కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా రాత్రి వేళ పలుచోట్ల వాహనాలను నిలిపారు. లారీలు, బస్సులు, వ్యాన్లు, కార్లు తదితర వాహనాల డ్రైవర్లకు నీరు అందించి ఫేస్ వాష్ చేయించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
News December 17, 2025
కడప: పెళ్లి ఇష్టం లేక యువకుడి ఆత్మహత్య..?

ఈ ఘటన కడప జిల్లా రాజుపాలెం మండలంలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల వివరాల మేరకు.. చాగలమర్రి(M) గోట్లూరుకు చెందిన యువకుడు(24) మెకానిక్ పనిచేస్తుంటాడు. నంద్యాల జిల్లాకు చెందిన ఓ అమ్మాయితో పెళ్లి నిర్ణయించారు. బ్యాంకులో పని ఉందని సోమవారం ఇంట్లో వాళ్లకు చెప్పి యువకుడు బయటకు వచ్చాడు. రాజుపాలెం మండలం వెల్లాల పొలాల్లోకి వచ్చి విషం తాగి చనిపోయాడు. తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
News December 17, 2025
కడప జిల్లాలో 47,822 రేషన్ కార్డులు ప్రభుత్వానికి సరెండర్

కడప జిల్లాకు 5,73,675 స్మార్ట్ రేషన్ కార్డులు వచ్చాయి. వీటి పంపిణీకి గడువు ముగిసింది. 47,822 కార్డులు మిగిలిపోయాయి. వీటిని గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ప్రభుత్వానికి సరెండర్ చేస్తున్నారు. వీటి కోసం రూ.200 చెల్లించి పోస్ట్ ద్వారా పొందాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. జమ్మలమడుగు డివిజన్లో 17,514, కడపలో 14,455, బద్వేల్‌లో 11,112, పులివెందులలో 4,741 రేషన్ కార్డులు మిగిలిపోయాయి.


