News April 1, 2024
వేమూరు అసెంబ్లీ నియోజకవర్గం..

వేమూరు అసెంబ్లీ నియోజకవర్గం 1995లో ఏర్పడింది. అయితే అంతకు ముందు అమృతలూరు నియోజకవర్గంలో ఉండేది. 1965 నుంచి 2004 వరకు జనరల్ నియోజకవర్గంగా ఉండగా.. 2009లో ఈ నియోజకవర్గం (SC)గా మారింది. అయితే 1955 నుంచి 2019 వరకు జరిగిన ఎన్నికల్లో ఇప్పటివరకు మహిళా అభ్యర్థినులు గెలవలేదు. రాబోవు ఎన్నికల్లో అయినా నియోజకవర్గంలో మహిళలు పోటీ చేస్తారా లేదా అన్నది తెలియాల్సిఉంది. మరి మీ కామెంట్.
Similar News
News February 13, 2026
వినియోగదారుల హక్కులు పరిరక్షించాలి: JC

వినియోగదారుల హక్కులు పరిరక్షణ జరగాలని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ అన్నారు. జిల్లా వినియోగదారుల రక్షణ మండలి సమావేశం శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. జేసీ మాట్లాడుతూ.. వినియోగదారుల రక్షణ చట్టం, 2019 ప్రకారం వినియోగదారుల హక్కుల పరిరక్షణకు జిల్లా వినియోగదారుల రక్షణ మండలి కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కమిటీ సభ్యులు సూచించిన అంశాల పట్ల సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
News February 13, 2026
GNT: టెన్త్, ఇంటర్ పరీక్షలపై కలెక్టర్ సమీక్ష

గుంటూరు జిల్లాలో పది, ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. పది, ఇంటర్ పరీక్షలపై కలెక్టరేట్‌లో శుక్రవారం జిల్లా సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయుటకు తగిన విధంగా ఏర్పాట్లు ఉండాలన్నారు. పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, వైద్య శిబిరాలు, అందులో అత్యవసర మందులు ఉండాలని చెప్పారు.
News February 13, 2026
GNT: క్వారీ తిరునాళ్లపై ఎస్పీ వకుల్ జిందాల్ నిఘా

వడ్లమూడి క్వారీ తిరునాళ్ల నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను ఎస్పీ వకుల్ జిందాల్ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆలయ పరిసరాలు, ప్రభల ప్రదేశాలు, పొంగళ్ల స్థలాలను సందర్శించి అధికారులకు కీలక సూచనలు చేశారు. డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతరం నిఘా ఉంచాలని, భక్తుల రద్దీ దృష్ట్యా అదనపు సిబ్బందిని కేటాయించాలని ఆదేశించారు. భక్తులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా పటిష్ట బందోబస్తు నిర్వహించాలని స్పష్టం చేశారు.


