News January 27, 2025
వేమూరు: పెద్దకర్మకు వెళ్లి అఘాయిత్యం

మతిస్తిమితం లేని మహిళపై అత్యాచారం చేసిన దారుణ ఘటన వేమూరు మండలంలో చోటు చేసుకుంది. ఎస్ఐ రామకృష్ణ వివరాల మేరకు.. గుంటూరుకు చెందిన ఆంజనేయులు వేమూరు మండలం జంపని గ్రామంలో ఈనెల 23వ తేదీన బంధువుల పెద్ద కర్మకు వచ్చాడు. అక్కడ అదే రోజు అర్ధరాత్రి కూతురు వరుసయ్యే మతిస్తిమితం లేని మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆంజనేయులను అదుపులోకి తీసుకొని తెనాలి కోర్టులో హాజరు పరిచామన్నారు.
Similar News
News February 15, 2025
పెనుకొండ ఉపాధ్యాయుడికి జైలు శిక్ష

పెనుకొండకు చెందిన మాజీ పాత్రికేయుడు మహేశ్ వద్ద ఐదేళ్ల క్రితం రూ.3.24 లక్షలను ఉపాధ్యాయుడు సూర్యనారాయణ రెడ్డి అప్పుగా తీసుకున్నారు. తిరిగి ఇచ్చిన చెక్కు బౌన్స్ కావడంతో బాధితుడు కోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘ విచారణ అనంతరం శుక్రవారం న్యాయమూర్తి సయ్యద్ ముజీబ్ ఫసల్ ఉపాధ్యాయుడికి 6నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. రూ.6.48లక్షలు చెల్లించాలని పేర్కొన్నారు. నిందితుడిని పోలీసులు సబ్ జైలుకు తరలించారు.
News February 15, 2025
అనకాపల్లి: నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు

ఓ వ్యక్తి ఆత్మహత్యకు కారకుడైన నిందితుడిని శుక్రవారం అరెస్టు చేసినట్లు అనకాపల్లి పట్టణ ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. అనకాపల్లి పట్టణానికి చెందిన ఎస్.పైడిశెట్టి దస్తావేజుల కోసం ఒత్తిడి చేయడంతో డి.వెంకట సత్యనారాయణ ఈనెల 11వ తేదీన పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య జయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News February 15, 2025
కర్నూలులో బర్డ్ ఫ్లూ.. ‘ఆందోళన అవసరం లేదు’

కర్నూలులో బర్డ్ ఫ్లూపై ఆందోళన అవసరం లేదని పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ జి.శ్రీనివాస్ తెలిపారు. నగరంలోని నరసింహారావు పేటను రెడ్ జోన్‌గా గుర్తించి చికెన్, గుడ్ల అమ్మకాలను నిలిపివేశామని తెలిపారు. మిగిలిన ప్రాంతాల్లో చికెన్, గుడ్ల అమ్మకం కొనసాగుతుందన్నారు. చికెన్‌ను 100 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉడికించి తింటే ఎలాంటి ప్రమాదం ఉండదని స్పష్టం చేశారు.