News March 1, 2025
వేర్వేరు ఘటనల్లో ముగ్గురి ఆత్మహత్య

MBNR, WNP, NGKL జిల్లాల్లో శుక్రవారం వేర్వేరు ఘటనల్లో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికుల వివరాలిలా.. జడ్చర్లకు చెందిన వడ్డె సంజీవ(30) అప్పులు తీర్చలేక ఉరేసుకున్నాడు. గోపాల్‌పేటకు చెందిన కొంకలి మల్లయ్య(40) కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నారు. NGKL జిల్లా పెనిమిళ్లకి చెందిన మేర కృష్ణయ్య సోదరి దగ్గర ఉంటుండగా, కడుపునొప్పి భరించలేక పొలం వద్ద ఉరేసుకున్నాడు.
Similar News
News March 22, 2025
NGKL: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే

కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పీవీ నందకుమార్ రెడ్డి, తోటి శాసనసభ్యులతో కలిసి ఎమ్మెల్యే డాక్టర్ కూచకుళ్ల రాజేశ్ రెడ్డి శుక్రవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అలాగే, రాష్ట్ర IT పరిశ్రమ, వాణిజ్యం & శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుని కూడా కలిసి రాష్ట్ర అభివృద్ధి, ఆరోగ్య శాఖ సంబంధిత అంశాలపై చర్చించారు.
News March 22, 2025
నీటి ఉధృతితో సహాయక చర్యలకు ఆటంకం

TG: SLBC టన్నెల్‌లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఊట నీటి ఉధృతి పెరగడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. దీంతో కార్మికుల భద్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు సమీక్ష నిర్వహించారు. అటు నిత్యం సహాయక చర్యలు కొనసాగేలా కార్మికుల పని షిఫ్టులను 3 నుంచి 5కు పెంచారు. 28 రోజుల కింద టన్నెల్‌లో 8 మంది గల్లంతు కాగా ఒకరి మృతదేహాన్ని ఇటీవల వెలికితీశారు. మరో ఏడుగురి ఆచూకీ లభించాల్సి ఉంది.
News March 22, 2025
NTR: ఆరేళ్ల తర్వాత సంచలన తీర్పు

కామవరపుకోట(M) గుంటుపల్లి బౌద్ధాలయాల వద్ద 2019లో ప్రేమజంటపై దాడి జరిగింది. ఈక్రమంలో యువతిని హత్య చేశారు. NTR(D) జి.కొండూరుకు చెందిన రాజు(28), ద్వారకాతిరుమల(M) జి.కొత్తపల్లికి చెందిన సోమయ్య(22), గంగయ్య(20), నందివాడ(M) అరిశెల గ్రామానికి చెందిన నాగరాజును నిందితులుగా గుర్తించారు. వీరికి జీవిత ఖైదు విధిస్తూ పోక్సో కోర్టు జడ్జి సుమా సునంద శిక్ష విధించారని ఏలూరు SP ప్రతాప్ శివకిషోర్ వెల్లడించారు.