News December 2, 2025

వైకుంఠ ద్వార దర్శనం.. నేడు ఈ-డిప్

image

AP: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలకు ఈ-డిప్‌లో ఎంపికైన భక్తుల వివరాలను నేడు TTD విడుదల చేయనుంది. వైకుంఠ ఏకాదశి తొలి 3 రోజుల(డిసెంబర్ 30, 31, జనవరి 1) దర్శనానికి 24 లక్షల మంది పేర్లు నమోదు చేసుకున్నారు. మొత్తం 1.8 లక్షల టోకెన్లు అందుబాటులో ఉన్నాయి. వీటికి ఈ-డిప్‌లో ఎంపికైన భక్తుల ఫోన్లకు ఇవాళ మెసేజ్ వస్తుంది. ఇక మిగిలిన 7 రోజులకు(జనవరి 2-8) నేరుగా వచ్చే భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు.

Similar News

News February 13, 2026

కొచ్చిన్ పోర్ట్ అథారిటీలో ఉద్యోగాలు

image

కొచ్చిన్ పోర్ట్ అథారిటీ 5 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు మార్చి 10 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BTech/BE (సివిల్ ఇంజినీరింగ్) అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. Sr. ప్రాజెక్ట్ కన్సల్టెంట్‌కు నెలకు రూ.65వేలు, ప్రాజెక్ట్ కన్సల్టెంట్‌కు రూ.55వేలు చెల్లిస్తారు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ, DV ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.cochinport.gov.in

News February 13, 2026

మంచిర్యాల కార్పొరేషన్‌లో కాంగ్రెస్ విజయం

image

TG: మంచిర్యాల కార్పొరేషన్‌‌ను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. 60 డివిజన్లలో 45 స్థానాలను సొంతం చేసుకుంది. BRS 5, BJP ఒక డివిజన్‌లో గెలుపొందాయి. అటు నల్గొండ, మహబూబ్‌నగర్, రామగుండంలోనూ కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. కరీంనగర్, నిజామాబాద్‌లో బీజేపీ లీడ్‌లో ఉంది. BRS ఒక్క కార్పొరేషన్‌లోనూ సత్తా చాటలేకపోతోంది.

News February 13, 2026

శివ నామాలు అర్థాలు ‘‘నీల లోహిత’’

image

సృష్టి ఆరంభంలో బ్రహ్మ దేవుడి కోపం నుంచి శివుడు ఉద్భవించినప్పుడు ఆయన ‘నీల లోహిత’ రూపంలో ఉన్నాడు. ‘నీల’ అంటే ఆకాశం అంతటి నీలి రంగు, ‘లోహిత’ అంటే అగ్ని లాంటి ఎరుపు రంగు. అంటే సృష్టిలోని శాంతిని, అలాగే ప్రళయ కాలంలోని తీవ్రతను రెండింటినీ ఆయన తనలో కలిగి ఉంటారని దీని అర్థం. అర్ధనారీశ్వర రూపానికి ఇది మరో సంకేతం. నీలం రంగు జ్ఞానానికి చిహ్నం అయితే, ఎరుపు రంగు శక్తికి, క్రియాశీలతకు నిదర్శనం.