News November 19, 2025
వైద్య అధికారులకు పల్నాడు కలెక్టర్ ఆదేశాలు

ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కు సంబంధించిన అన్ని బకాయిలను 15 రోజుల్లో పూర్తి చేసి నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లా ఆదేశించారు. కలెక్టరేట్‌లో సత్తెనపల్లి, చిలకలూరిపేట, నరసరావుపేట ఏరియా ఆసుపత్రుల వైద్య అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టులో ఉన్న సౌకర్యాల స్థాయిని, నిధుల ఉత్పత్తిని కలెక్టర్ సమీక్షించారు.
Similar News
News January 18, 2026
తెలంగాణ క్యాబినెట్ భేటీ కీలక నిర్ణయాలు

* మెట్రో ఫేజ్ 2ఏ, ఫేజ్ 2బీ భూసేకరణకు సంబంధించి రూ.2,787 కోట్ల కేటాయింపునకు ఆమోద ముద్ర
* ములుగు జిల్లాలో సాగునీరు అందించేందుకు పొట్లాపూర్ ఎత్తిపోతల పథకానికి మంత్రివర్గం ఆమోదం
* 2027లో జులై 27- ఆగస్టు 3 వరకు జరిగే గోదావరి పుష్కరాలకు బాసర-భద్రాచలం వరకు ఉన్న పురాతన ఆలయాల శాశ్వత అభివృద్ధి, ఎకో పార్కుల నిర్మాణానికి నిర్ణయం
* మేడారంలో శాశ్వత భవనాల నిర్మాణానికి నిర్ణయం
News January 18, 2026
30ఏళ్లు దాటాయా? ఈ టెస్టులు చేయించుకుంటే బెటర్

30ఏళ్లు దాటిన వాళ్లు అనారోగ్య సమస్యల బారినపడే ప్రమాదం ఎక్కువగా ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రాథమిక స్థాయిలోనే సమస్యను గుర్తించి చికిత్స తీసుకుంటే మంచిదని చెబుతున్నారు. ఏడాదికోసారి BP, డయాబెటీస్, హార్ట్ డిసీజెస్, కిడ్నీ ఫంక్షన్, కంటి పరీక్షలు, థైరాయిడ్ టెస్టు చేయించుకోవాలని సూచిస్తున్నారు. 30-65ఏళ్ల మహిళలు ప్రతి 3సంవత్సరాలకు పాప్ స్మియర్/5ఏళ్లకు HPV టెస్ట్ చేయించుకోవాలని చెబుతున్నారు.
News January 18, 2026
భర్తిపూడిలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ

తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి చిరునామాగా మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు మారారని మంత్రి గొట్టిపాటి రవికుమార్, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు చెప్పారు. బాపట్ల మండలం భర్తిపూడి గ్రామంలో ఆదివారం ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. సినీ నటుడిగా, రాజకీయ నేతగా ప్రజలకు ఆయన ఎన్నో సేవలు చేశారని కొనియాడారు. బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ పాల్గొన్నారు.


