News October 6, 2025
వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలి: డీఎంహెచ్ఓ

వైద్యులు, వైద్య సిబ్బంది సమయ పాలన పాటించాలని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ములుగు డీఎంహెచ్ఓ డాక్టర్ గోపాల్ రావు అన్నారు. రాయినిగూడెం పీహెచ్‌సీ పరిధి మల్లంపల్లి, జాకారం ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలను సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. గర్భిణులను గుర్తించి ప్రభుత్వ వైద్యశాలలోనే ప్రసూతి జరిగేలా చొరవ తీసుకోవాలని సూచించారు. TB, NCD నివారణకు కృషి చేయాలన్నారు.
Similar News
News January 19, 2026
ఏలూరు: 130 పరీక్ష కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు

ఏలూరు జిల్లాలోని 130 పరీక్షా కేంద్రాల్లో జనవరి 21 నుంచి మార్చి 24 వరకు జరుగు ఇంటర్ పరీక్షలకు 34,615 మంది విద్యార్ధులు హాజరుకానున్నట్లు కలెక్టర్ వెట్రిసెల్వి సోమవారం తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. పరీక్షా పత్రాలను స్ట్రాంగ్ రూంలలో భద్రపరచాలని, ఆయా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్త్ పకడ్బందీగా ఏర్పాటుచేయాలన్నారు.
News January 19, 2026
‘దండోరా’పై జూనియర్ ఎన్టీఆర్ ప్రశంసలు

శివాజీ, నవదీప్, బిందు మాధవి ప్రధాన పాత్రల్లో నటించిన ‘దండోరా’ సినిమాపై హీరో Jr NTR ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమా గాఢమైన భావోద్వేగాలతో ఆలోచింపజేసే విధంగా ఉందని అభిప్రాయపడ్డారు. నటీనటులందరి ప్రదర్శన అద్భుతమని తెలిపారు. దర్శకుడు మురళీకాంత్ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారని అన్నారు. ఈ సినిమా JAN 14 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
News January 19, 2026
నాగర్‌కర్నూల్: ప్రజావాణికి 40 దరఖాస్తులు

కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 40 దరఖాస్తులు వచ్చినట్లు అదనపు కలెక్టర్ అమరేందర్ తెలిపారు. వచ్చిన ఫిర్యాదులను ఏవో చంద్రశేఖర్‌తో కలిసి ఆయన స్వయంగా స్వీకరించారు. భూ సమస్యలు, వివిధ విభాగాల ఫిర్యాదులపై వచ్చిన ఈ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.


