News February 7, 2025

వైభవంగా మహా కుంభాభిషేకం ప్రారంభం

image

కాళేశ్వర క్షేత్రంలో మహా కుంభాభిషేకం వైభవంగా ప్రారంభమైంది. వేద పండితులు అచలాపురం రిత్వికులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వేద పండితులు మంత్రోచ్ఛారణల మధ్య అత్యంత అరుదైన ఘట్టానికి శ్రీకారం జరిగింది. కుంభాభిషేక కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేశామని, భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు అన్ని శాఖలతో సమన్వయం చేసుకొని, ముందుకు సాగే విధంగా కార్యాచరణను అధికారులు రూపొందించారు.

Similar News

News March 19, 2025

ఖమ్మం జిల్లాలో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు

image

ఖమ్మం జిల్లా మధిరలో మంగళవారం అత్యధికంగా 40.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అటు కామేపల్లి, కారేపల్లిలో 39.7, సత్తుపల్లి 39.5, వైరా 39.3, ముదిగొండ (పమ్మి) 39.3, వేంసూరు, పెనుబల్లి 38.9, నేలకొండపల్లి 38.8, రఘునాథపాలెం 38.7, కొణిజర్ల 38.2, కల్లూరు 37.2, ఖమ్మం అర్బన్ 37.9, ఖమ్మం రూరల్ (పల్లెగూడెం) 37.6, ఏన్కూరు (తిమ్మరావుపేట) 37.5డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపారు.

News March 19, 2025

ప్రత్యేక కార్యాచరణతో ఉపాధి పనుల అమలు: కలెక్టర్

image

ఖమ్మం: రాబోయే 10 రోజుల పాటు ప్రత్యేక కార్యాచరణతో ఉపాధి హామీ పనులను జిల్లాలో అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ ఉపాధి హామీ పనులపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. వ్యవసాయ విస్తరణ అధికారులు క్షేత్రస్థాయిలో రైతులతో సంప్రదించి ఆసక్తి గల వారి పొలాల్లో ఫామ్ పాండ్ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను సూచించారు.

News March 19, 2025

రోదసిలో అధిక కాలం ఉంటే వచ్చే ఆరోగ్య సమస్యలివే

image

గురుత్వాకర్షణ శక్తి లేకపోవడం వల్ల శారీరక శ్రమ ఉండదు. తద్వారా కండరాలు, ఎముకలలో క్షీణత మెుదలవుతుంది. భార రహిత స్థితి వల్ల చెవిలోని వెస్టిబ్యులర్ అవయవానికి అందే సమాచారం మారిపోతుంది దీంతో మెదడు సరిగ్గా పనిచేయదు. శరీరంలోని పైభాగంలో, తలలో రక్తం పేరుకుపోతోంది. తెల్ల రక్తకణాలు తగ్గే ప్రమాదముండటంతో రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. అధిక రేడియో ధార్మికత వల్ల దీర్ఘకాల ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవ్వచ్చు.

error: Content is protected !!