News November 19, 2025

వైరా MLA చొరవ.. ఆర్మీ జవాన్ భార్యకు ఉద్యోగం

image

ఇటీవల కశ్మీర్‌లో ప్రమాదవశాత్తు మరణించిన వైరా నియోజకవర్గం సూర్యతండాకు చెందిన ఆర్మీ జవాన్ భార్య బానోత్ రేణుకకు ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ఇచ్చిన హామీని నెరవేర్చుకున్నారు. జవాన్ కుటుంబాన్ని ఆదుకునేందుకు కలెక్టర్‌తో స్వయంగా మాట్లాడి, ఆమెకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించారు. ఎమ్మెల్యే చూపిన చొరవకు తండా వాసులు, జవాన్ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.

Similar News

News January 25, 2026

16 రోజుల డిజిటల్ అరెస్ట్.. రూ.14 కోట్లు స్వాహా

image

డిజిటల్ అరెస్ట్ పేరుతో ఓ NRI దంపతుల నుంచి ఏకంగా రూ.14.84 కోట్లను సైబర్ నేరగాళ్లు కాజేశారు. తాము CBI, పోలీసులమని చెప్పి నకిలీ అరెస్ట్ వారెంట్ చూపించి ఢిల్లీలో నివసిస్తున్న 77 ఏళ్ల మహిళ, ఆమె భర్తను 16 రోజుల పాటు వీడియో కాల్‌లో నిరంతరం నిఘా పెట్టారు. భయంతో బాధితులు తమ పెట్టుబడుల నుంచి డబ్బును వారికి ట్రాన్స్‌ఫర్ చేశారు. ఈ కేసులో GJ, UP, ఒడిశా రాష్ట్రాల్లో 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

News January 25, 2026

రథసప్తమి.. తిరుమలలో పటిష్ఠ బందోబస్తు

image

తిరుమలలో శ్రీవారి రథసప్తమి వేడుకలను శాంతియుతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ శాఖ పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసింది. ఎస్పీ ఎల్.సుబ్బారాయుడు, టీటీడీ సీవీ&ఎస్‌ఓ మురళీకృష్ణ కీలక ప్రాంతాలను పరిశీలించి బందోబస్తును సమీక్షించారు. భారీగా భక్తుల రాక నేపథ్యంలో ట్రాఫిక్ నియంత్రణ, సీసీ కెమెరాల పర్యవేక్షణ, పుష్కరిణి వద్ద అదనపు సిబ్బంది, జియో-ట్యాగింగ్ వంటి చర్యలు చేపట్టారు.

News January 25, 2026

సంగారెడ్డి: పీడీఎస్ బియ్యం బహిరంగ వేలం

image

సంగారెడ్డి జిల్లాలో వివిధ దాడుల్లో పట్టుబడిన అక్రమ పీడీఎస్ బియ్యాన్ని బహిరంగ వేలం వేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. గోదాముల్లో నిల్వ ఉన్న ఈ సరుకును “యథాతథం” పద్ధతిలో విక్రయించనున్నారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన బీవరేజెస్, డిస్టిలరీ సంస్థల నుండి సీల్డ్ కొటేషన్లను ఆహ్వానించారు. ఆసక్తి గల వారు జిల్లా పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.