News November 19, 2025
వైరా MLA చొరవ.. ఆర్మీ జవాన్ భార్యకు ఉద్యోగం

ఇటీవల కశ్మీర్‌లో ప్రమాదవశాత్తు మరణించిన వైరా నియోజకవర్గం సూర్యతండాకు చెందిన ఆర్మీ జవాన్ భార్య బానోత్ రేణుకకు ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ఇచ్చిన హామీని నెరవేర్చుకున్నారు. జవాన్ కుటుంబాన్ని ఆదుకునేందుకు కలెక్టర్‌తో స్వయంగా మాట్లాడి, ఆమెకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించారు. ఎమ్మెల్యే చూపిన చొరవకు తండా వాసులు, జవాన్ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.
Similar News
News January 24, 2026
నేడు నగరిలో చంద్రబాబు పర్యటన

AP: నేడు CM చంద్రబాబు చిత్తూరు(D) నగరిలో పర్యటించనున్నారు. 11AMకు నగరి జూ. కాలేజ్‌లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడే ప్రజల నుంచి అర్జీలు తీసుకుంటారు. తర్వాత శాప్ మైదానంలో ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర ప్రజా వేదికలో పాల్గొంటారు. అక్కడ స్వచ్ఛ రథాలను ప్రారంభిస్తారు. అనంతరం జూనియర్ కాలేజ్ గ్రౌండ్‌లో TDP శ్రేణులతో సమావేశమవుతారు. సాయంత్రం తిరుగు పయనమవుతారు.
News January 24, 2026
డెయిరీ ఫామ్ ప్రారంభించే ముందు ఇవి చేయాలి

డెయిరీ ఫామ్ ప్రారంభానికి ముందు కొంత భూమిలో నేపియర్, గినీ గడ్డి, జొన్న.. మరి కొంత భూమిలో అలసంద, పిల్లిపెసర, లూసర్న్ పశుగ్రాసాలను సాగుచేయాలి. సుబాబుల్, అవిసె చెట్లను ఫామ్ పెట్టే స్థలం చుట్టూ కంచెలా వేయాలి. ఇలా పశుగ్రాసాన్ని పెంచి, షెడ్లు కట్టిన తర్వాత పరికరాలు, మందులు కొనుగోలు చేశాక పాడి పశువులను కొనాలంటున్నారు నిపుణులు. అధిక పాలిచ్చే పశువుకు ఉండే లక్షణాలు తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట క్లిక్ <<>>చేయండి.
News January 24, 2026
ఏలూరు: ప్రమాదం.. బావాబామ్మరుదులు మృతి

గ్రీన్ ఫీల్డ్ హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో జంగారెడ్డిగూడెం మండలం లక్కవరానికి చెందిన కొమ్ము సాయి, కామవరపుకోట మండలం రామవరానికి చెందిన గట్టు రాంబాబు మృతి చెందారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా కల్లూరు మండలం లింగాల గ్రామ సమీపంలో గ్రీన్ ఫీల్డ్ హైవే పై బైక్ అదుపు తప్పి రైలింగ్ ఢీకొనడంతో వారిద్దరూ మృతి చెందారు. వారిద్దరూ వరుసకు బావ బావమరుదులు. మొక్కజొన్న కంపెనీలో పనిచేస్తున్నట్లు తెలిసింది.


