News April 13, 2025

వైసీపీ పీఏసీ కమిటీ మెంబర్‌గా ఆదిమూలపు సురేశ్

image

వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా కొండపి నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త డాక్టర్ ఆదిమూలపు సురేశ్‌ను శనివారం వైసీపీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి నియమించారు. రాష్ట్రవ్యాప్తంగా నియమించిన 30 మందిలో ఆదిమూలపు సురేశ్ ఒకరు. కొండపి నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో వైసీపీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. వైసీపీ గెలుపే లక్ష్యంగా మున్ముందు పనిచేస్తామన్నారు.

Similar News

News January 14, 2026

సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ఇన్‌ఛార్జి కలెక్టర్ రాజాబాబు

image

సంక్రాంతి పండగ సందర్భంగా మార్కాపురం జిల్లా ప్రజలకు ఇన్‌ఛార్జి కలెక్టర్ రాజబాబు శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు తెలియజేసే పల్లెల పండగగా సంక్రాంతి నిలుస్తుందన్నారు. బంధుమిత్రులను అందరిని కలుసుకొని కను విందులు చేసే అందరి పండగ సంక్రాంతి అన్నారు. రైతులకు పంట చేతికి వచ్చే కాలమని, ఆనందాన్ని కుటుంబంతో పంచుకొని సంతోషించే వేడుక సంక్రాంతి అన్నారు.

News January 13, 2026

ఒంగోలులో బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు సస్పెండ్

image

ఒంగోలులోని యాదవ మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో SGTగా పనిచేస్తున్న ఉపాధ్యాయుడు శ్రీనివాసరావును విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు DEO రేణుక తెలిపారు. ఈ మేరకు DEO కార్యాలయం మంగళవారం ప్రకటన విడుదల చేసింది. ఉపాధ్యాయుడు పాఠశాలలో బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, గైర్హాజరైన విద్యార్థుల అటెండెన్స్ వేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నట్లు అందిన నివేదిక మేరకు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.

News January 13, 2026

సింగరాయకొండలో చైనా మాంజా తగిలి ఉద్యోగికి గాయాలు

image

చైనా మాంజా తగిలి ఉద్యోగికి గాయాలైన ఘటన మంగళవారం సింగరాయకొండలో చోటుచేసుకుంది. బాధితుడు, పోస్ట్‌మ్యాన్ గోపి వివరాల మేరకు.. ఉదయాన్నే ఉత్తరాల బట్వాడా చేసే సమయంలో గాలిపటానికి ఉపయోగించే చైనా మాంజా దారం మెడకు తగిలి గాయాలయ్యాయి. స్థానికులు ఆసుపత్రికి తరలించారు. మాంజ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అధికారులు ప్రజలను అప్రమత్తం చేయాలని కోరారు.