News April 13, 2025
వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో బాపట్ల మాజీ ఎంపీ, ఎమ్మెల్యే

వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో 33 మందితో సభ్యులను నియమిస్తూ వైసీపీ కేంద్ర కార్యాలయం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో బాపట్ల మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి, మాజీ ఎంపీ నందిగామ సురేశ్‌లను సభ్యులుగా నియమించింది. బాపట్లకు చెందిన ఇద్దరు మాజీలకు కమిటీలో స్థానం లభించడంతో వైసీపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News April 19, 2026
ఓపెనర్ల పరుగుల వరద.. తీవ్ర పోటీ

టీమ్‌ఇండియా ఓపెనింగ్ స్లాట్ కోసం విపరీతమైన పోటీ నెలకొంది. IPLలో భారత ఓపెనర్లు పరుగుల వరద పారిస్తున్నారు. వైభవ్ సూర్యవంశీ, జైస్వాల్, సంజూ శాంసన్, అభిషేక్, ఇషాన్ కిషన్, గిల్, KL రాహుల్, ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ మంచి ఫామ్‌లో ఉన్నారు. ఇప్పటివరకు గిల్ 251 (4 మ్యాచులు), వైభవ్ 246 (6), జైస్వాల్ 223 (6), ఇషాన్ 213 (6), ప్రియాన్ష్ 211 (5), ప్రభ్‌సిమ్రన్ సింగ్ 211 (6), అభిషేక్ 188 (6) రన్స్ చేశారు.
News April 19, 2026
21న కృష్ణా జిల్లా తైక్వాండో జట్ల ఎంపికలు

కృష్ణా జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 21న పొన్నవరంలోని ఏకత్వా పాఠశాలలో అండర్ 17 కాడెట్, సీనియర్ పురుషుల, మహిళలు తైక్వాండో జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా తైక్వాండో సంఘం అధ్యక్షులు బస్సే నాగ ప్రసాద్ తెలిపారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆసక్తి గలవారు ఎవరైనా ఈ పోటీలలో పాల్గొనవచ్చని తెలిపారు. ఇక్కడ విజేతలుగా నిలిచిన వారిని తిరుపతిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొనాలన్నారు.