News March 6, 2025
వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా పూల శ్రీనివాస్ రెడ్డి

రాష్ట్ర వైసీపీ కార్యదర్శిగా సత్యసాయి జిల్లా కదిరి నియోజవర్గం తలుపుల మండలానికి చెందిన పూల శ్రీనివాస్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు వైసీపీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డికి శ్రీనివాస్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.
Similar News
News February 11, 2026
జనగామ: 12 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గుర్తింపు

జనగామ, స్టేషన్ ఘనపూర్ మున్సిపల్ ఎన్నికల్లో 12 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. జనగామలో 8, స్టేషన్ ఘనపూర్ లో 4 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. ఆయా కేంద్రాల్లో పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు ఎన్నికల అధికారులు చేపట్టారు.
News February 11, 2026
దేశ ఇంధన భద్రతలో కీలక కేంద్రంగా విశాఖ

విశాఖ దేశ ఇంధన భద్రతకు కీలక వ్యూహాత్మక కేంద్రంగా ఎదిగింది. భారత్ పెట్రోలియం నిల్వలను విశాఖ, మంగళూరు, పడూర్ ప్రాంతాల్లో భూగర్భ గుహల్లో ఏర్పాటు చేసింది. ఈ నిల్వలు రిఫైనరీల స్టాక్‌తో కలిపి దేశ అవసరాలను 74 రోజులు తీర్చగలవని కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి పార్లమెంట్‌లో చెప్పారు. తూర్పు తీరంలో విశాఖ నిల్వ సదుపాయం ఇంధన సరఫరా స్థిరత్వానికి బలోపేతం చేస్తూ జాతీయ భద్రతలో కీలక పాత్ర పోషిస్తోంది.
News February 11, 2026
చిత్తూరు: కోట్ల రూపాయలు విలువ చేసే భూమిపై కన్ను…!

అనంతపురం- చెన్నై హైవేలోని రొంపిచెర్ల(M) బండకిందలో రూ.3 కోట్లు విలువ చేసే సర్వే నంబర్ 32, 36 లో సుమారు 0.75 సెంట్ల భూమిని ఆక్రమించి చదును చేసుకున్నారు. 2,3 రోజులుగా ఈ తంతు జరుగుతున్నా అధికారులు పట్టించుకోలేదు. దీంతో కబ్జాదారుడు ఒకడుగు ముందుకు వేసి కంచె వేసి మామిడి మొక్కలు నాటేశారు. 20 రోజుల క్రితం బడబళ్లవంక నుంచి ఎర్రబాపన చెరువుకు పోతున్న సప్లై ఛానల్‌ను పూడ్చివేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.


