News March 7, 2025

వై. రామవరంలో టీచర్ మృతి

image

వై. రామవరం మండలం దాలిపాడు గ్రామానికి చెందిన ఉపాద్యాయుడు చిన్నబ్బాయి రోడ్డు ప్రమాదంలో శుక్రవారం మృతి చెందారు. ఈయన తూ.గో లోని గోకవరం మండలం గోవిందపురం ఉన్నత పాఠశాలలో సోషల్ స్టడీస్ మాస్టర్‌గా పని చేస్తున్నారు. ఆయన బైక్‌పై పాఠశాలకు వెళ్తుండగా కొత్తపల్లి పెట్రోల్ బంకు వద్ద ఎదురుగా వెళ్తున్న కారును ఢీకొట్టడంతో తలకు బలమైన గాయమై ఘటనా స్థలంలోనే మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు.

Similar News

News December 17, 2025

రంగారెడ్డి: పోలింగ్ ఫైనల్ UPDATE

image

రంగారెడ్డి జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. మధ్యాహ్నం ఒంటి గంట వరకు జిల్లాలోని 7 మండలాల్లో 81.54 శాతం పోలింగ్ నమోదు అయ్యింది.
1.అబ్దుల్లాపూర్‌మెట్-77.42
2.ఇబ్రహీంపట్నం-85.41
3.కందుకూరు-86.73
4.మాడ్గుల్-74
5.మహేశ్వరం-80.01
6.మంచాల్-83.34
7.యాచారం-83

News December 17, 2025

నాగర్ కర్నూల్ జిల్లాలో 77.82 శాతం ఓటింగ్‌

image

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రశాంతంగా సాగింది. ప్రాథమిక సమాచారం మేరకు జిల్లా వ్యాప్తంగా 77.82 శాతం ఓటింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. గడువు ముగిసినప్పటికీ పలు కేంద్రాల్లో ఓటర్లు క్యూలైన్లలో ఉండటంతో వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. పూర్తి వివరాలు అందాక పోలింగ్‌ శాతం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

News December 17, 2025

వికారాబాద్ జిల్లాలో 78.79 శాతం పోలింగ్

image

VKB జిల్లాలో మూడో విడత ఎన్నికల్లో భాగంగా మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగిన పోలింగ్‌లో 78.79 శాతం పోలింగ్ నమోదయినట్లు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. బుధవారం వికారాబాద్ జిల్లాలోని పూడూర్, పరిగి దోమ, కుల్కచర్ల, చౌడాపూర్ మండలాల్లో మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు పోలింగ్ జరిగింది. మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఎన్నికల కౌంటింగ్ నిర్వహించి అభ్యర్థుల గెలుపును ఎన్నికల అధికారులు ప్రకటించనున్నారు.